Kalki 2898AD OTT : కళ్ళు చెదిరే ధరకు అమ్ముడైన “కల్కి” ఓటిటి రైట్స్… బడ్జెట్ లో సగం వెనక్కి వచ్చినట్టేనా?

Kalki 2898AD OTT : మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “కల్కి” రిలీజ్ గురించి ప్రభాస్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ లో ఉన్నాయి. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కల్కి మూవీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేట్రికల్, ఓటిటి, సాటిలైట్ రైట్స్ కోసం డిమాండ్ గట్టిగానే ఏర్పడింది. ఈ పరిస్థితిని నిర్మాతలు కూడా క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే కల్కి మూవీ ఓటిటి రైట్స్ ను కళ్ళు చెదిరే ధరకు అమ్మినట్టుగా సమాచారం. మరి ఇంతకీ “కల్కి” ఓటిటి డీల్ ఏంటి? ఎన్ని కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి? అనే వివరాల్లోకి వెళ్తే…

ఓటీటీ డీల్ తోనే బడ్జెట్లో సగం వెనక్కి…

ఈ మూవీకి తాజాగా జరిగిన భారీ ఓటిటి డీల్ ద్వారా అప్పుడే మేకర్స్ బడ్జెట్లో సగాన్ని వెనక్కి రాబట్టారని టాక్ నడుస్తోంది. కల్కి మూవీ సౌత్ ఇండియన్ రైట్స్ దాదాపు 200 కోట్లకు అమ్ముడయ్యాయని, హిందీ వెర్షన్ ను మాత్రం 175 కోట్లకు కొనుగోలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా కలిపి చూసుకుంటే ఈ మూవీ ఓటిటి రైట్స్ 375 కోట్లకు అమ్ముడైనట్టు టాక్ నడుస్తోంది. కానీ తాజా సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్ తో ఈ డీల్ కు సంబంధించిన చర్చలు ఇంకా నడుస్తున్నట్టు తెలుస్తోంది. మేకర్స్ 400 కోట్లకు డీల్ సెట్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఫైనల్ గా ఈ డీల్ ఎంతకు సెట్ అవుతుందో చూడాలి.

“కల్కి”కి బాహుబలి రిలీజ్ డేట్….

“కల్కి” మూవీలో అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించగా, దీపిక పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీ రిలీజ్ విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ ఇంకా వీడలేదు. ముందుగా కల్కి మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ గత ఏడాది డిసెంబర్లో సలార్ థియేటర్లలోకి రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత మే 9న కల్కిని థియేటర్లలోకి తీసుకొస్తామని అనౌన్స్ చేశారు. వైజయంతి మూవీస్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి వంటి సినిమాలు అదే తేదీన రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సెంటిమెంట్ గా భావించారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ వీళ్ళ సెంటిమెంట్ పై దెబ్బేసాయి. దీంతో ఇప్పుడు కల్కి రిలీజ్ డేట్ ను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చిత్ర బృందం “బాహుబలి” రిలీజ్ డేట్ నే “కల్కి”ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ జూలై 10 నా రిలీజ్ అయ్యి రికార్డులను బద్దలు కొట్టింది. అదే మ్యాజిక్ రిపీట్ అవ్వాలని కోరుకుంటూ “కల్కి” మేకర్స్ జూలైలోనే ఈ మూవీ కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. “కల్కి” మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇస్తేనే ఈ కన్ఫ్యూజన్ కు తెరపడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు