Ayalaan Telugu OTT: “అయలాన్” వచ్చేదే లేదా…? షారుక్ ఖాన్ మరీ అంతగా పగ పట్టారా?

తమిళ స్టార్ శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ “అయలాన్” తెలుగు రిలీజ్ కు ఇంకా మోక్షం దక్కలేదు. ఈ మూవీ ఇప్పటికే ఓటిటీలో వచ్చేసింది. కానీ తెలుగు వెర్షన్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ సినిమాపై మరీ అంత పగ పట్టారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ “అయలాన్”. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇప్పటికే తమిళంలో సంక్రాంతి కానుకగా రిలీజై, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జనవరి 12న “అయలాన్” తమిళంలో రిలీజ్ కాగా, తెలుగు వెర్షన్ ను కూడా ఆ సమయంలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు సంక్రాంతి రేసులో దిగడం, థియేటర్లు దొరకపోవడం వల్ల “అయలాన్” వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో తమిళంలో అయితే అనుకున్న సమయానికి రిలీజ్ చేయగలిగారు కానీ, తెలుగులో వాయిదా వేయాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే “అయలాన్” మూవీ తెలుగు రైట్స్ ను కొనుగోలు చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిపబ్లిక్ డే జనవరి 26న “అయలాన్”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. ఒక ఏలియన్ భూమ్మీదికి దిగివచ్చి మానవుడితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ను ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దారు డైరెక్టర్ రవికుమార్. ఈ సినిమాను చూడడానికి తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఆసక్తిని కనబరిచారు. కానీ లీగల్ ఇష్యూస్ కారణంగా షోలు క్యాన్సిల్ కావడంతో నిరాశ తప్పలేదు. ఆ తర్వాత “అయలాన్” థియేట్రికల్ రిలీజ్ గురించి ఎంతగా ఎదురుచూసినా ఫలితం లేకపోయింది.

- Advertisement -

కనీసం ఓటీటీలోనైనా ఈ సినిమాను చూడవచ్చని ఎదురు చూస్తున్న తెలుగు ఆడియన్స్ కు అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. సన్ నెక్స్ట్ లో కేవలం తమిళ వర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. సాధారణంగా సినిమాలకు లీగల్ ఇష్యూస్ అనేవి థియేట్రికల్ రిలీజ్ వరకు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ “అయలాన్”కు మాత్రం కనీసం ఓటీటీలో రిలీజ్ అయ్యే భాగ్యం కూడా దక్కకపోవడం, అది కూడా తెలుగు వెర్షన్ కే ఎందుకో ఎవ్వరికీ అర్థం కాని విషయంగా మిగిలిపోయింది. దాదాపు 8 ఏళ్ల పాటు నిర్మాణంలో ఉన్న ఈ మూవీ ఎట్టకేలకు ఎన్నో అవాంతరాలను దాటుకుని తెరపైకి వచ్చింది. కానీ తెలుగులో మాత్రం ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు.

అసలు వివాదం ఏంటంటే…
“అయలాన్” మూవీ వీఎఫ్ఎక్స్ పనుల బాధ్యతను షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ తీసుకుందట. అయితే దీనికి సంబంధించిన బకాయిల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు రావడంతో “అయలాన్” తెలుగు వెర్షన్ ను రెడ్ చిల్లీస్ వాళ్ళు నిర్మాతలకు ఇవ్వలేదు. ముందుగా జనవరి 26 వరకు తెలుగు వెర్షన్ ను ఇచ్చేస్తామని రెడ్ చిల్లీస్ వాళ్ళు చెప్పారట. అందుకే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు.

కానీ డబ్బుల చెల్లింపుల విషయంలో “అయలాన్” టీం చేసిన ఆలస్యం కారణంగా తెలుగు వెర్షన్ కాపీని తమ దగ్గరే పెట్టుకున్నారట. అంతకంటే ముందు రెడ్ చిల్లిస్ వారు ట్విట్టర్లో “అయలాన్” తెలుగు వెర్షన్ ఇంకా థియేటర్లో రిలీజ్ కాలేదు అంటూ సెటైరికల్ గా ట్వీట్ వేయగా, “అయలాన్” నిర్మాతలు గుడ్ జాబ్ రెడ్ చిల్లీస్ అంటూ రిప్లై ఇవ్వడంతో వీరి మధ్య ఉన్న వివాదం బయటపడింది. ఈ వివాదం నేపథ్యంలోనే “అయలాన్” తెలుగు వెర్షన్ థియేటర్ రిలీజ్ కు నోచుకోలేదు. ఈ వివాదం ఇంకా పరిష్కారం దొరకలేదో ఏమో మరి ఇప్పుడేమో ఓటిటీలో రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు