Ayalaan Telugu Release: తెలుగు వర్షన్‌ను అడ్డుకున్న షారుక్ ఖాన్… ఇక థియేటర్‌లో కష్టమే…!

Ayalaan Telugu Release

శివ కార్తికేయన్ హీరోగా సంక్రాంతి కానుకగా అయాలన్ అనే ఓ మూవీ వచ్చింది. తమిళ భాషలో ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయింది. అదే రోజున తెలుగులో కూడా విడుదల కావాల్సి వచ్చింది. కానీ, సంక్రాంతి టైంలో తెలుగు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువ ఉండటంతో నిర్మాతలు జనవరి 26న తెలుగు వర్షన్ ను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. తమిళలో పాజిటివ్ టాక్ రావడం, భారీగా కలెక్షన్లు రావడంతో తెలుగు ఆడియన్స్ అయాలన్ మూవీపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

అలాగే సైన్స్ ఫిక్షన్ మూవీ కాబట్టి రోజు రోజుకు ఇంట్రెస్ట్ పెరిగింది. మూవీ యూనిట్ కూడా జనవరి 26ని టార్గెట్ చేసుకుని ప్రమోషన్స్ చేశారు. హీరో శివ కార్తికేయ హైదరాబాద్ లో అయాలన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించాడు. జనవరి 26న బుక్ మై షోలో అయాలన్ మూవీ టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. కానీ, సరైన టైంకి థియేటర్ లో బొమ్మ పడలేదు. షోలు క్యాన్సిల్ అయ్యాయి… టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తామని మెసెజ్ లు వచ్చాయి. తర్వాత అయాలన్ తెలుగు రిలీజ్ వాయిదా పడింది అంటూ వార్తలు వచ్చాయి.

అయితే అయాలన్ మూవీ తెలుగు వర్షన్ ఎందుకు వాయిదా పడింది? జనవరి 26న ఎందుకు రిలీజ్ కాలేకపోయింది అనే విషయం ఎవరికీ తెలిదు. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. అయాలన్ తెలుగు వర్షన్ విడుదల కాకపోవడానికి కారణం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అని తెలుస్తుంది.

- Advertisement -

అయాలన్ మూవీ వీఎఫ్ఎక్స్ పనులు అన్నీ షారుక్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ చేసిందట. అయితే, దీనికి సంబంధించిన బకాయిల విషయంలో వీరి మధ్య కొన్ని గొడవలు ఉన్నాయని సమాచారం. దీంతో అయాలన్ తెలుగు వర్షన్ ను నిర్మాతలకు షారుక్ ఖాన్ చెందని రెడ్ చిల్లీస్ వాళ్లు ఇవ్వలేదని తెలుస్తుంది. ముందుగా జనవరి 26 వరకు తెలుగు వర్షన్ ను అందిస్తామని రెడ్ చిల్లీస్ వాళ్లు చెప్పారట. కానీ, డబ్బుల చెల్లింపుల విషయంలో అయాలన్ మూవీ టీం జాప్యం చేయడంతో తెలుగు వర్షన్ కాపీని తమ దగ్గరే పెట్టుకున్నారట. దీంతో జనవరి 26న అయాలన్ తెలుగు వర్షన్ విడుదల కాలేకపోయిందని తెలుస్తుంది.

ఈ విషయం ఇప్పుడు ఎలా బయటికి వచ్చిందంటే… తాజాగా షారుక్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ తమ ట్విట్టర్‌లో… అయాలన్ తెలుగు వర్షన్ ఇంకా థియేటర్ లో రిలీజ్ కాలేదు అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. దీనికి అయాలన్ ప్రొడ్యూసర్లు.. గుడ్ జాబ్ రెడ్ చిల్లీస్ అంటూ రిప్లే ఇచ్చారు. ఇలా వీరి మధ్య ఉన్న వివాదం బయటికి వచ్చింది. అయితే ప్రస్తుతం వీరి మధ్య గొడవ చల్లారేలా లేదని తెలుస్తుంది. దీంతో అయాలన్ తెలుగు వర్షన్ ఇక థియేటర్ లో రాకపోవచ్చు. మూవీని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసిన సమయంలోనే తెలుగు వర్షన్ అందుబాటులోకి రానుందని సమాచారం.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు