Jyothika : సౌత్ హీరోలపై జ్యోతిక షాకింగ్ కామెంట్స్… బాలీవుడ్ పై ఆశే కారణమా?

సీనియర్ హీరోయిన్ జ్యోతిక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత ఆమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. ఒకవేళ మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కితే హీరోల సరసన లీడ్ రోల్ చేయడానికి కూడా రెడీ అంటుంది. చాలా ఏళ్ల తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. త్వరలోనే “సైతాన్” సినిమాతో హిందీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జ్యోతిక సౌత్ హీరోలను అజయ్ దేవగన్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

జ్యోతిక మాట్లాడుతూ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేదాకా అజయ్ ప్రవర్తించిన తీరు తనను సర్ప్రైజ్ చేసిందని చెప్పుకొచ్చింది. ఇప్పటిదాకా తాను దాదాపు అందరూ సౌత్ హీరోలతో కలిసి పని చేశానని, అలాగే తన తాజా చిత్రం మమ్ముట్టితో చేసిన విషయాన్ని జ్యోతిక గుర్తుచేసుకుంది. అయితే ఇన్నేళ్ల ఈ సిని ప్రయాణంలో తను పని కోసం ఎంత కష్టపడతాం అన్నదే ముఖ్యమనే విషయాన్ని తెలుసుకున్నానని, అజయ్ అసలు ఎలాంటి స్వార్థం లేకుండా ఈ మూవీ కోసం కష్టపడ్డాడని, ఆఖరికి పోస్టర్లో కూడా తనకు చాలా ప్రాధాన్యతను ఇచ్చాడని ఈ బాలీవుడ్ హీరోపై ప్రశంసల వర్షం కురిపించింది. అయితే సౌత్ హీరోలతో సినిమాలు చేసినా ఎవ్వరూ పోస్టర్లలో ఇంత ప్రాధాన్యత ఇవ్వరేమో అంటూ ఈ బాలీవుడ్ హీరో గురించి జ్యోతిక చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

అక్కడితో ఆగకుండా మమ్ముట్టిని, అజయ్ ను చూస్తుంటే వాళ్లే సినిమాలకు అసలైన స్టార్స్ అనిపిస్తుందని ఈ ఇద్దరు స్టార్స్ పై పొగడ్తల వర్షం కురిపించింది. నిజానికి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారని, కానీ తిరిగి ఇచ్చేవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమేనని, వీళ్ళు సినిమాలకు తిరిగి ఇచ్చేస్తున్నారని, చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేసింది. ఇక “సైతాన్”లో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న మాధవన్ గురించి మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత తామిద్దరూ ఇలాంటి పాత్రల్లో నటిస్తున్నామంటే ఎదిగామని అనుకుంటున్నామని చెప్పుకొచ్చింది. అయితే సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్ళిన తర్వాత చాలామంది హీరోయిన్లు ఇలాగే చేసే పనే ఇది. లైఫ్ ఇచ్చిన సౌత్ ను తక్కువ చేసి మాట్లాడడం హీరోయిన్లకు కొత్తేమీ కాదు. ఇప్పటిదాకా ఇలియానా, రాధిక ఆప్టే, తాప్సి వంటి హీరోయిన్లు ఇలాగే చేశారు. ఇప్పుడు జ్యోతిక కూడా ఆ లిస్టులో చేరిపోయింది. కాగా “సైతాన్” మూవీ మార్చ్ 8న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.\

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు