Jyothika -Suriya : విడాకులకు సిద్ధం అయిన జ్యోతిక – సూర్య.. అసలు నిజం ఇదే..!

Jyothika -Suriya : కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జ్యోతిక – సూర్య దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇద్దరూ కూడా పలు సినిమాల్లో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రేమలో పడ్డ వీరు, ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. ఇక వీరి ప్రేమ పెళ్లి బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం హీరోగా సూర్య వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకుంటే.. జ్యోతిక కూడా నటిగా రీ ఎంట్రీ ఇచ్చి అంతకుమించి పాపులారిటీ సొంతం చేసుకుంటోందని చెప్పవచ్చు.

అంతే కాదు జ్యోతిక నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ తన భర్త సూర్య హీరోగా చేసే సినిమాలను నిర్మిస్తుంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం వీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ బాగా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రూమర్స్ రావడానికి అసలు కారణం బయటకు వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

గతంలో జ్యోతికను… సూర్య కుటుంబీకులు తమ ఇంట్లోకి ఆహ్వానించడానికి ఇష్టపడలేదని, ఇక అందుకే తరచూ గొడవలు జరుగుతుండడం వల్లే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి విడిపోవాలనుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే సూర్య మాత్రం జ్యోతికను విడిచిపెట్టలేక కుటుంబ సభ్యులను వదిలి ముంబైకి మకాం మార్చారు అనే వార్తలు కూడా వినిపించాయి.

- Advertisement -

వాస్తవానికి ముంబైలో పుట్టి పెరిగిన జ్యోతిక.. సూర్యను వివాహం చేసుకున్న తర్వాత తమిళనాడులోనే సెటిల్ అయిపోయింది. అయితే ఇటీవల పిల్లల్ని తీసుకుని ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో కుటుంబంలో గొడవలు వచ్చాయని, అందుకే విడాకుల రూమర్స్ కూడా బాగా వినిపించాయి. అయితే పిల్లల చదువు, తల్లిదండ్రులు బాగోగులు చూసుకోవడం కోసమే జ్యోతిక తన పుట్టింటింకి వెళ్లినట్టు టాక్ వినిపించింది. అయితే ఇవి కాకుండా ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది.పెళ్లి తర్వాత నటనను పూర్తిగా పక్కన పెట్టిన జ్యోతిక.. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్ద వాళ్ళు అవ్వడంతో ’36 వయదినిలే’ సినిమా ద్వారా సెకండ్ విన్నింగ్ మొదలుపెట్టింది. దాదాపు ఆరేళ్ళు సినిమాలు చేసిన తర్వాత ఈమధ్యనే మలయాళంలో వచ్చిన కాథల్ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఇప్పుడు మూడు హిందీ సినిమాలు కూడా చేస్తోంది. ఇప్పటివరకు సౌత్ సినిమాలకే పరిమితమైన జ్యోతిక.. బాలీవుడ్ పై ఫోకస్ చేయడానికి ముంబైకి షిఫ్ట్ అయిందట. అంతేకానీ విడాకులు కారణం కాదని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏది నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు