Ayodhya: రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన స్టార్స్ వీరే..!

Ayodhya: ఎట్టకేలకు 2024 జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూసి యావత్ దేశ ప్రజలు, రామభక్తులు పులకించి పోయారు. కోట్లాదిమంది భారతీయుల శతాబ్దాల కల నెరవేరింది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు 2021లో రామ మందిర నిర్మాణం ప్రారంభించగా.. అప్పట్లోనే పలువురు ప్రముఖులు ఆలయ నిర్మాణానికి భారీగా విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటివరకు రామ మందిర నిర్మాణానికి రూ.1,100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి తెలిపారు.

ఇకపోతే 2021లో ప్రారంభమైన రామ మందిరం నిర్మాణానికి పలువురు సెలబ్రిటీలు తమ వంతు సహాయంగా విరాళాలు అందించి వార్తల్లో నిలిచారు. తాజాగా రామ మందిరం పూర్తయిన నేపథ్యంలో ఈ విషయాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. మరి రామ మందిర నిర్మాణానికి చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరెవరు ఎంత విరాళం ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.

పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి రూ.30 లక్షల విరాళం ఇచ్చారు.

- Advertisement -

అనుపమ్ ఖేర్:
బాలీవుడ్ నటుడు కాశ్మీరీ ఫైల్స్ ఫేమ్ అనుపమ్ ఖేర్ గత అక్టోబర్లో అయోధ్యను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు. రామ మందిర్ నిర్మాణ స్థలంలో రికార్డు చేసిన క్లిప్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆలయానికి ఇటుకలు ఇవ్వడం తన అదృష్టమని తెలిపారు.

ముఖేష్ ఖన్నా:
ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా 2021 ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణం కోసం రూ.1.1 లక్షల చెక్కును అధికారులకు అందజేశారు.

ప్రణీత సుభాష్:
ప్రముఖ నటి ప్రణీత సుభాష్ 2021 జనవరి 12న అయోధ్య రామ మందిర నిధి అంకితం ప్రచారానికి రూ.1 లక్ష విరాళం ఇస్తున్నట్లు చెబుతూ ఒక వీడియోని పోస్ట్ చేశారు. అంతేకాదు  అందరూ చేయి చేయి కలిపి పాల్గొనాల్సిందిగా కూడా కోరుతున్నట్లు ఆమె ఆ వీడియోలో తెలిపారు.

ఇక వీరితోపాటు అక్షయ్ కుమార్, మనోజ్ జోషి, హేమమాలిని, గుర్మీత్ చౌదరి తదితరులు రామ మందిరం నిర్మాణంలో భాగమైనట్లు తెలుస్తోంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు