Vadivelu: తండ్రేమో స్టార్ కమెడియన్.. కానీ కొడుకు మాత్రం..!

Vadivelu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాస్యబ్రహ్మగా బ్రహ్మానందం ఎంత పేరైతే సంపాదించుకున్నారో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లెజెండరీ కమెడియన్ గా వడివేలు కూడా అంతే పేరు దక్కించుకున్నారు. గత కొన్ని రోజుల వరకు సినిమాలకు దూరంగా ఉన్న వడివేలు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. వడివేలు గురించి అందరికీ తెలుసు కానీ ఆయన కుటుంబ సభ్యుల గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదనే చెప్పాలి. వడివేలు సాధారణంగా మీడియాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల… తన ఫ్యామిలీ గురించి బయట ఎవరికీ పెద్దగా తెలియదు.  కానీ ఇటీవల వడివేలు కొడుకు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఆయన కుమారుడు ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా వైరల్ గా మారింది.

వడివేలు కొడుకు సుబ్రమణి పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలు చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. అసలు సుబ్రమణి ఎక్కడ ఉంటున్నారు? వడివేలు కొడుకుని సినిమాలోకి ఎందుకు తీసుకురాలేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో సుబ్రమణి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రి వడివేలు గురించి అలాగే కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వడివేలుకి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరికీ కూడా వివాహం అయింది. కొడుకు సుబ్రమణికి పదేళ్ల క్రితమే దగ్గర బంధువు కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. అతి కొద్ది మంది సమక్షంలోనే సుబ్రమణి పెళ్లి జరిగింది.

- Advertisement -

సుబ్రమణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నా తండ్రికి ఏ విషయంలో అయినా సిఫారసు చేయడం ఇష్టం ఉండదు. అందుకే ఎక్కడ తండ్రి పేరు ఉపయోగించను. నా తండ్రి అంటే నాకెంతో ఇష్టం. ఆయన పేరునే నా పిల్లలకు పెట్టాను. అంతేకాదు నాకు ఏ అవసరం వచ్చినా సరే నా తండ్రి సహాయం చేస్తారని అనుకోనని.. ఆయన మీద ఆధారపడకుండా వ్యవసాయం చేసుకుంటున్నాను. నా తండ్రి వడివేలు వారసత్వంగా ఇచ్చిన పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాను. సిటీకి రమ్మని పిలిచినా నేను వెళ్లలేను” అంటూ తెలిపారు సుబ్రమణి. ఇది చూసిన నెటిజన్స్ మీ కొడుకును మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దారు అంటూ వడివేలుకు కితాబు ఇస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు