Sunny leone: డబ్బు కోసం అలాంటి పనులు కూడా చేశాను – సన్నీలియోన్..!

Sunny leone:  సన్నీలియోన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె నటిగా, యాంకర్ గా, వ్యాపారవేత్తగా ఇలా అనేక రంగాలలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీలియోన్… తన కెరియర్, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను వెల్లడించింది. నటిగా లేదా హోస్టుగా తనకు తానుగా ఏ వెర్షన్ ను ఎక్కువగా ఇష్టపడుతుంది అని ఇంటర్వ్యూలో సన్నీ లియోన్‌ను అడగగా.. దానికి ఆమె మాట్లాడుతూ.. “నాకు నటిగా ఉండడం అంటే చాలా ఇష్టం. కానీ నేను యాంకర్ గా కొన్ని షోలను కూడా చేశాను. సృజనాత్మకంగా ఆలోచిస్తాను. అలాగే డబ్బు సంపాదించడానికి ఎన్నో పనులు చేశాను” అంటూ తెలిపింది.

“నేను నా ఉద్యోగాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాను. నేను చేసే పనిని ఇష్టపడతాను. కొత్త విషయాలను కూడా నేర్చుకోవాలని.. వాటి గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటాను. కాబట్టి ఎంత సమయం కావాలన్నా సరే వాటి కోసం వెయిట్ చేస్తాను. ఇలా డబ్బు సంపాదించడానికి నటిగా మారాను.. హోస్టుగా మారాను.. ఆఖరికి వ్యాపారవేత్తగా కూడా మారాను” అంటూ తెలిపింది సన్నీలియోన్.. ఇకపోతే స్ప్లిట్స్ విల్లా గురించి మాట్లాడుతూ మేము మరొక సీజన్ కి సిద్ధమవుతున్నామని, ఈ సంవత్సరం కూడా మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తామని, పోటీదారులు రావడం నాకు చాలా ఇష్టమంటూ వివరించింది.

అలాగే చిత్ర పరిశ్రమకు కూడా AI భవిష్యత్తు ఉందని మీరు అనుకుంటున్నారా? అని అడగగా.. దానికి సన్నిలియోన్ మాట్లాడుతూ.. “AI చాలాకాలం పాటు మాతో ఉందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం డబ్బు సంపాదించి భవిష్యత్తులోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని నేను అనుకుంటున్నాను.. ఒక అడుగు ముందుకు వేయడానికి ఏ ఐ చాలా సహాయపడుతుందని కూడా భావిస్తున్నాను” అంటూ తెలిపింది సన్నీలియోన్. ప్రస్తుతం సన్నీలియోన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు