HBD Tripti dimri: త్రిప్తి కోరికలు మామూలుగా లేవుగా.. కాబోయే వాడిపై..!

ప్రముఖ బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి గతంలో చాలా చిత్రాలలో నటించింది. కానీ గత ఏడాది యానిమల్ సినిమాతోనే ఈమెకు భారీ గుర్తింపు లభించిందని చెప్పాలి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన నేపథ్యంలో అన్ని భాషలలో కూడా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ఆఫర్ల మీద ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే ఈరోజు త్రిప్తి పుట్టినరోజు సందర్భంగా ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం యానిమల్.. ఈ సినిమాలో త్రిప్తి – రణబీర్ కపూర్ మధ్య సాగే బోల్డ్ సన్నివేశాలు ఒక్కసారిగా వీరిద్దరిని పాపులర్ చేసేశాయి.. దీంతో ఈమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి..

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తనకు కాబోయే భర్తకు అలాంటి క్వాలిటీస్ ఉండాలంటూ చెప్పుకొచ్చింది. ఈమె విషయానికొస్తే ఉత్తరాఖండ్లో పుట్టి పెరిగిన త్రిప్తి కొంతకాలం మోడల్ గా పనిచేసింది.. ఆ తర్వాత సంతూర్ మమ్మీగా కూడా పేరు తెచ్చుకుంది. 2017లో పోస్టర్ బాయ్స్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన త్రిప్తి.. 2018లో లైలా మజ్ను, 2020లో బుల్ బుల్ సినిమాలు బ్రేక్ ఇచ్చాయి. యానిమల్ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పటికే మేరే మెహబూబ్ మేరే సనమ్ చిత్రంలో నటిస్తున్న ఈమెకి.. తెలుగు, తమిళ్ భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి..

ఇకపోతే ఈమె తన పెళ్లి గురించి.. కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పిన త్రిప్తి.. తనకు కాబోయే భర్త మాత్రం ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ఉండాలని.. అంతేకాదు తనను అర్థం చేసుకునే మంచి వ్యక్తి అయి ఉండాలని కోరుకుంటుంది.. ఇకపోతే గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మతో డేటింగ్ చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే అతడితో విడిపోయిన తర్వాత బిజినెస్ మేన్ సామ్ మర్చంట్ తో కూడా డేటింగ్ చేసినట్లు పుకార్లు కూడా సృష్టించారు . కానీ వీటిపై ఈమె ఎప్పుడు స్పందించలేదు ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ తో ఆషీకీ -3 మీద సైన్ చేసింది. మరి కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ అయితే చెప్పింది కానీ ఎప్పుడు వివాహం చేసుకుంటుందో అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు