NTR : సింహాద్రి రీ-రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ హంగామా

దునియాలో ఎక్కడా.. లేదు ఒక రీ-రిలీజ్ సినిమాకి ప్రి రిలీజ్ ఫంక్షన్ జరగడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా గర్వపడే మూమెంట్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.

మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు వస్తుండటంతో ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సింహాద్రి సినిమాని రీ రిలీజ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఛీఫ్ గెస్ట్ గా పాల్గొన్న విశ్వక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో కలిసి హంగామా చేసాడు.

RRR సినిమాతో ఖండాంతరాలు దాటినా ఎన్టీఆర్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమాని ఆయన పుట్టినరోజు కానుకగా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. దాదాపు వెయ్యి షో లతో సింహాంద్రి సినిమా థియేటర్ లలో ప్రదర్షింపబడుతుంది.

- Advertisement -

సాధారణంగా స్టార్ హీరోల పుట్టిన రోజులకి వాళ్ళ సూపర్ హిట్ సినిమాలని రీ-రిలీజ్ చేయడం చాలా రోజుల క్రితం నుంచే వస్తుంది. కానీ అవి ఒకటి రెండు షో లకి, రెండు మూడు థియేటర్ లకే పరిమితం కాగా పోకిరి, ఖుషి, సినిమాలతో ఈ ట్రెండ్ ఇంకా ఊపు అందుకుంది. ఫ్యాన్స్ నుంచి డిమాండ్ లు రావడం మొదలయ్యాయి. దాంతో ప్రొడ్యూసర్ లు కూడా అభిమానుల కోరికలని గౌరవిస్తూ 4K మాస్టరింగ్ చేసి బెస్ట్ క్వాలిటీ తో సినిమాలని హీరోల బర్త్ డే లకు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా రీ-రిలీజ్ సినిమాలకి కూడా ప్రి రిలీజ్ ఫంక్షన్ చేసే స్టేజ్ కి వెళ్ళింది టాలీవుడ్.

ఎన్టీఆర్ వీరాభిమానిగా విశ్వక్ సేన్ సింహాద్రి రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరై సింహాద్రి సినిమాలోని పాటలకి స్టెప్పులు వేసి, అభిమానుల మధ్యలో నిలబడి జూనియర్ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. అలాగే అయన “సినిమా బాగా ఎంజాయ్ చేయండి అంతేగాని థియేటర్ మరి ఎక్కువ వైల్డ్ అయిపోయి సీట్ లు చింపేయడాలు, స్క్రీన్ చింపేయడాలు చేయకండి. మన హీరో మనకి దేవుడైతే థియేటర్ మనకి దేవాలయం లాంటిది” అంటూ ఫ్యాన్స్ కి దిశానిర్దేశం చేసాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు