Sujeeth : పవన్ కళ్యాణ్ OG నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్

పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా OG. ప్రభాస్ తో సాహు సినిమా చేసిన తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న సుజీత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి జోడిగా ఈ సినిమాలో నాని నటించిన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ నటిస్తుంది.

అయితే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ని మొదటగా ముంబై లో స్టార్ట్ చేసిన మూవీ యూనిట్, పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ పై కీలకమైన సీన్స్ ని తెరకెక్కించారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులనుంచి భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ OG నే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేసే సినిమాలన్నీటీలో హరి హర వీరమల్లు సినిమాని మినహాయిస్తే మిగితవన్ని రీమేక్ సినిమాలే కాగా OG స్ట్రయిట్ సినిమా అవడం, అలాగే సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ రోల్ లో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ముంబై లో మొదలైన OG సినిమా, మొదటి రెండు షెడ్యూల్స్ ని ఇటీవలనే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో ఈరోజు నుంచి మొదలవుతుంది. మొదటి షెడ్యూల్ లో భాగంగా పవన్ ఇంట్రడక్షన్, ప్రియాంక మోహన్, పవన్ కి మధ్య లవ్ సీన్స్ తెరకెక్కించిన సుజీత్ హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేయనున్నారు.ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతుండటంతో రెండు సినిమాల షూటింగ్స్ కి పవన్ కళ్యాణ్ కి కన్వీనియెంట్ గా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. OG సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న వినోదయం సితాం రీమేక్ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రేపు రిలీజ్ అవనుంది
For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు