కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 16 నుంచి 27 వరకు ఫ్రాన్స్ లో గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్ లో ఇండియన్ సినిమా నుంచి చాలా మంది సెలబ్రెటీలు పాల్గొనబోతున్నారు. ఇప్పటికే, అనుష్క శర్మ, సారా అలీఖాన్, మానుషీ చిల్లర్, ఈష గుప్త కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ ఈవెంట్ లో సందడి చేశారు. వీరితో పాటు మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్, అదితీ రావ్ హైదరీ, సన్నీ లియోన్, మృణాల్ ఠాకూర్ తో పాటు మరి కొంత మంది సెలబ్రెటీలు కూడా ఈ ఫెస్టివల్ లో సందడి చేయనున్నారు.
వీరిలో మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఉంది. ఫ్రాన్స్ లో జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయడానికి తమన్నా ఇప్పటికే బయలుదేరింది. అయితే తమన్నాతో పాటు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కూడా ఉన్నాడు. గత కొన్నాళ్లుగా తమన్నా, విజయ్ వర్మ డేటింగ్ లో ఉన్నారంటూ తెగ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ జంట బీ టౌన్ వీధుల్లో షికార్లు కొడుతున్న సందర్బంలో కెమెరా కంట చిక్కి అనేక సార్లు వైరల్ అయ్యారు. దీంతో తమన్నా, విజయ్ వర్మ రిలేషన్ షిప్ లో ఉన్నారని దాదాపు కాన్ఫామ్ అయింది.
Read More: Netflix: ఇండియా లో టాప్ 10 సినిమాలు మరియు టీవీ షోలు (ఫిబ్రవరి 2023)
అయితే తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఈ జంట కలిసి వెళ్లడంపై అనుమానాలు మరింత స్ట్రాంగ్ అవుతున్నాయి. అయితే ఈ అంతర్జాతీయ వేదికపై తమ రిలేషన్ షిప్ గురించి ప్రకటించే అవకాశం ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడతున్నారు. అందుకే ఈ జంట కలిసి వెళ్తున్నారని అంటున్నారు. మరి తమన్నా ఇన్నాళ్లు దాచి ఉంచిన తమ సీక్రెట్ రిలేషన్ షిప్ ను ఈ అంతర్జాతీయ వేదికపై అయినా రివీల్ చేస్తుందా? లేదా ఎప్పటిలాగే అసలు విషయం దాచి ట్రిప్ ను ఎంజాయ్ చేసి వస్తారా? అనేది చూడాలి.
For More Updates :
Read More: Mamta Mohandas:ఆ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను.
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...