Gumraah : సీతారామం హీరోయిన్ నటించిన కొత్త సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్

సీతారామం సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చి సీత పాత్ర ద్వారా తనదైన ముద్ర వేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం తెలుగులో నాని హీరోగా వస్తున్న nani30 సినిమా లో హీరోయిన్ గా చేస్తుంది. అయితే హిందీలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటుంది.

హిందీ లో లేటెస్ట్ గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన మూవీ “గుమ్రా”. ఈ సినిమా తెలుగులో రామ్ పోతినేని నటించిన సినిమా రెడ్ సినిమాకి రీమేక్. బాలీవుడ్ యాక్టర్ “ఆదిత్య రాయ్ కపూర్” ఈ సినిమా లో హీరోగా నటించాడు. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా పోస్టర్ లో ఆదిత్య రాయ్ రెండు పాత్రల్లో ఉన్న లుక్ ఉండగా మధ్యలో మృణాల్ ఠాకూర్ పోలీస్ జైతుప్ లో ఉంది. వర్ధన్ కెత్కర్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి సిరీస్ ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమా ను నిర్మించింది.

ఇక ఈ సినిమా యొక్క సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది. మార్చి 31 న ఈ సినిమాకు యూ /ఏ సర్టిఫికెట్ లభించింది. 129 నిమిషాల నిడివి గల ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 7 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది. తమిళం లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తెలుగు యావరేజ్ హిట్ అయింది. మరి హిందీలో ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు