Dasara: మూవీ టీమ్ కి అదిరిపోయే బహుమతులిచ్చిన నిర్మాత

మార్చి 30న విడుదలైన దసరా సినిమా సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. 5 రోజుల్లోనే 92 కోట్లకి పైగా వసూలు చేసి 100 కోట్ల దిశగా దూసుకుపోతుంది. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. SLV సినిమాస్ బ్యానర్ లో చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మించారు.

అయితే దసరా బ్లాక్ బస్టర్ అయిన సందర్బంగా ఈ సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ యూనిట్ లోని కీలకమైన సిబ్బందికి అలాగే నటీ నటులకి 10 గ్రాముల బరువైన బంగారు కాయిన్స్ ను బహుమతిగా అందచేశారు. అంతే కాదు సినిమా ని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కు 80 లక్షల విలువైన బిఎండబ్ల్యూ కార్ ని బహుమతి గా ఇవ్వడం జరిగింది.

అయితే ఈ సినిమా విడుదల కాకముందే సినిమా టీమ్ లో కొంత మందికి హీరోయిన్ కీర్తి సురేష్ గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఇపుడు అదే పద్ధతిని నిర్మాత ఫాలో అవ్వడం జరిగింది. ఇలా రెండు సార్లు చిత్ర యూనిట్ కి గోల్డ్ కాయిన్స్ బహుమతులు గా వచ్చాయి. ఇక దసరా సినిమా 5 వ రోజు తో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి ఎంటర్ కానుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు