Dasara: మాస్ డాన్స్ తో దుమ్ములేపిన కీర్తి

కీర్తి సురేష్… తెలుగు ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు. నేను శైలజ చిత్రం తో తెలుగు తెరకి పరిచయమైన ఈ భామ, తక్కువ రోజుల్లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మహానటి సినిమాతో నేషనల్ వైడ్ గా తన నటనతో మెప్పించి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు ని సైతం సొంతం చేసుకుంది. అయితే కీర్తి సురేష్ కు అవకాశాలకు కొదవ లేకపోయినా మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రం పెద్దగా రావడం లేదు. ఆ మధ్య లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన అవేవి అంతగా ఆకట్టుకోలేదు.

అయితే రీసెంట్ గా మార్చి 30న విడుదలైన దసరా చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ద్వారా తనకు వెన్నెల అనే అద్భుతమైన పాత్ర లభించిందని, మహానటి తర్వాత తనకు వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటి అని కీర్తి సురేష్ చెప్పింది. అయితే కీర్తి చెప్పినట్టే ఈ సినిమాలో వెన్నెల క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో హీరోకు ధీటుగా అదరగొట్టింది.

అయితే ఏప్రిల్ 3న దసరా మూవీ నుంచి యూట్యూబ్ లో కీర్తి సురేష్ స్పెషల్ డాన్స్ వీడియో ని రిలీజ్ చేసారు. దసరా సినిమాలో కీర్తి సురేష్ కి పెళ్లి అవుతుంది. ఆ పెళ్లి తర్వాత వచ్చే సాంగ్ లో లాస్ట్ 1మినిట్ బీట్ మాత్రం సింగల్ టేక్ తో కీర్తి సురేష్ తన డాన్స్ తో అదరగొట్టింది. తీన్ మార్ స్టెప్స్ ఉన్న ఈ బీట్ లో కీర్తి ఎప్పుడు చేయనంత ఎనర్జిటిక్ గా డాన్స్ చేసింది. డాన్స్ లో తమన్నా, శృతి హాసన్ తర్వాత కీర్తి సురేష్ అన్న రేంజ్ లో పెర్ఫార్మన్స్ చేసింది. ప్రస్తుతం దసరా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కీర్తి, తర్వాత భోళా శంకర్ షూటింగ్ లో పాల్గొంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు