Tej : విరూపాక్షకి ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా…?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేసిన సినిమా విరూపాక్ష విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 21న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు, అసలే సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న తేజ్ కు ఈ సినిమా సక్సెస్ అవ్వడం కీలకంగా మారింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ ఈ సినిమా దర్శకత్వం వస్తుండటంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇదే ఈ సినిమాకు, తేజ్ కు కలిసొచ్చే సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది. చిత్రలహరి తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేని తేజ్ ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టి తీరాల్సిన పరిస్థితి నెలకొంది.

టాలీవుడ్ లో ప్రస్తుతం సుకుమార్ శిష్యుల హవా నడుస్తోందని చెప్పచ్చు. ఉప్పెన సినిమాతో దర్శకుడైన బుచ్చిబాబు నుండి మొదలుకొని 18పేజెస్ ద్వారా సూర్యప్రతాప్, దసరాతో హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల పేరు ఇండస్ట్రీ వ్యాప్తంగా మారుమోగిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ కూడా సుకుమార్ శిష్యుడే అవటం ఒక రకంగా ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. తేజ్ నటించిన తొలి థ్రిల్లర్ సినిమా కావటంతో విరూపాక్ష పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ ది లక్కీ హ్యాండ్ అన్న పేరు ఉండటం కూడా ఈ సినిమాకు కలిసొచ్చే అంశం అనిపిస్తుంది.

మాములుగా సుకుమార్ నుండి ఎక్కువ శాతం లవ్ స్టోరీలే వచ్చినప్పటికీ, రంగస్థలం పుష్ప సినిమాలతో ఆయన ట్రాక్ మార్చారు. ఈ నేపథ్యంలో సుకుమార్ కలం నుండి వెలువడ్డ ఈ థ్రిల్లర్ స్టోరీ కూడా హిట్ అయ్యేలాగా ఉంది. ఒక రకంగా బ్యాడ్ ఫేజ్ లో ఉన్న తేజ్ కు సుకుమార్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి విరూపాక్ష మూవీ హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు