Nani : నానికి అదే మైనస్సయ్యిందా..?

నాని దసరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. నానికి ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అవ్వటం, దీనికి తోడు నాని పూర్తి మాస్ లుక్ కనిపించటం ఇదే తోలిసారి కావటం ప్రధాన ఆకర్షణ. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా సుమారు 80కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టి నాని కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు అందిస్తోంది. అంతే కాకుండా ఒక డెబ్యూ తో రిస్క్ చేసి మరీ పాన్ ఇండియా సినిమా తీసిన నాని గట్స్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. దసరా కలెక్షన్లపై స్పందించిన నాని తాము ఊహించిన దానికంటే దసరా సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని, ఈ సక్సెస్ తమ యూనిట్ కి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా తెలుగు నాట కలెక్షన్లతో దున్నేస్తున్న దసరాకు నార్త్ లో మాత్రం ఆశించినంత రీతిలో వసూళ్లు రావటం లేదు. నిజానికి నాని మార్కెట్ రేంజ్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టిన ఈ సినిమాకు నాని తెలుగునాట కంటే నార్త్ లోనే ఎక్కువ ప్రమోషన్స్ చేశారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం దక్కలేదు, ఇందుకు కారణాలు ఏంటని విశ్లేషించగా నాని నార్త్ ఆడియెన్స్ కు పరిచయం లేకపోవటమే అని తెలుస్తోంది. నిజానికి, మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయకపోయినా కూడా నార్త్ లో డబ్ అయ్యి అక్కడి ఆడియన్స్ ని అలరించాయి. అయితే అలా డబ్ అయిన సినిమాలన్నీ మాస్ అండ్ యాక్షన్ సినిమాలే.

నాని గత చిత్రాలన్నీ లవ్ స్టోరీస్ అవ్వటం దసరా సినిమాకు నార్త్ లో పెద్ద మైనస్ గా తయారైంది. అందుకు కాలికి బలపం కట్టుకొని మరీ ఊరూరా తిరిగి ప్రమోషన్స్ చేసినప్పటికీ అనుకున్న ఫలితం దక్కలేదు. ఒకవేళ నార్త్ ఆడియెన్స్ కు నాని ముందే పరిచయం అయ్యుంటే, దసరా సినిమా కలెక్షన్ల రేంజ్ మరోలా ఉండేది. చూద్దాం నాని ఇక ముందు తీయబోయే సినిమాలకైనా నార్త్ లో మంచి కలెక్షన్లు వస్తాయేమో.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు