Vijay Devarakonda : ఆ డైరెక్టర్ తో విజయ్ సినిమా లేనట్లేనా..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత సంవత్సరం లైగర్ సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడు. ఎన్నో ఆశలతో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసిన ఆ సినిమా అటు దర్శకుడు పూరీకి, హీరో విజయ్ కి తీవ్ర నిరాశ మిగిల్చింది. ఆ సినిమా తాలూకు ఎఫెక్ట్ విజయ్ ని ఇంకా వీడటం లేదని అనిపిస్తోంది. సుకుమార్ డైరెక్షన్లో విజయ్ హీరోగా మొదలవ్వాల్సిన సినిమా ఇంకా ప్రారంభం కాకపోవటమే ఇందుకు నిదర్శనం. నిజానికి ఈ సినిమా లైగర్ విడుదల తరువాత మొదలవ్వాల్సింది కానీ, ఆ టైం లో విజయ్ ఖుషి సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల అది కార్యరూపం దాల్చలేదు.

దీంతో పుష్ప సినిమా తర్వాత ఏడాది కాలం పాటు ఏ సినిమా మొదలు పెట్టని సుకుమార్ కూడా విజయ్ అందుబాటులో లేని కారణంగా పుష్ప 2 సినిమా పనుల్లో నిమగ్నం అయ్యాడు. ఇంతలోనే పుష్ప 2 తర్వాత సుకుమార్ రామ్ చరణ్ ల కాంబినేషన్లో సినిమా ఉండబోతోందంటూ వార్తలొచ్చాయి. దీంతో విజయ్ సుక్కుల సినిమా ఆగిపోయినట్లే అన్న సంకేతాలు వచ్చాయి. ఆ సంకేతాలకు బలం చేకూరుస్తూ గౌతమ్ తిన్ననూరితో విజయ్ నెక్స్ట్ మూవీ పట్టాలెక్కనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక సుక్కు విజయ్ ల కాంబినేషన్ ఉండబోదని కన్ఫామ్ అవుతోంది.

లైగర్ సినిమాతో డిజాస్టర్ చవిచూసిన విజయ్ కి ప్రస్తుతం సమంతతో నటిస్తున్న ఖుషి సినిమా చాలా కీలకం. ఈ సినిమా కూడా హిట్ అవ్వకపోతే విజయ్ గ్రాఫ్ పడిపోయే ప్రమాదం ఉంది అంతే కాకుండా, విజయ్ తరువాతి సినిమాపై కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆ రకంగా ఖుషి సినిమా హిట్ అయితే తప్ప విజయ్ మార్కెట్ పుంజుకునే అవకాశం లేదన్నమాట.

- Advertisement -

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు