Raviteja : రావణాసుర ప్రమోషన్స్ చాలా డల్ – ప్లాన్ ప్రకారమే చేస్తున్నారా..?

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల వరుస విజయాలతో ఊపుమీదున్న హీరో మాస్ మహారాజ రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రావణాసుర. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే విడుదల దగ్గర పడుతున్నప్పటికీ ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ అంతంత మాత్రంగానే చేస్తోంది. హీరో రవితేజ కూడా ప్రమోషన్స్ లో కనిపించట్లేదు కానీ, సినిమా యూనిట్ మాత్రం సక్సెస్ పై ధీమాగా ఉన్నారు. నిజానికి ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు పాటలు, కామెడీ వంటి పలు ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గురించి మాత్రమే ఎక్కువ చెప్పుకొస్తున్నారు.

లో ప్రొఫైల్ లో ప్రమోషన్స్ చేయటం అనేది కూడా ఒక టెక్నీక్ అనే చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమాకు రవితేజ మినహా పెద్ద పాజిటివ్ ఎలిమెంట్స్ ఏవీ కనిపించట్లేదు. దర్శకుడు సుధీర్ వర్మ రీసెంట్ గా శాకినీ డాకిని డిజాస్టర్ ఇవ్వటం, దీనికి తోడు ఆ సినిమా విషయంలో నెలకొన్న వివాదం, ఇవన్నీ రావణాసుర సినిమాకి పెద్దగా కలిసొచ్చే అంశాలు కాదు. అందుకే ప్రమోషన్స్ హై రేంజ్ లో చేసి, ప్రేక్షకుల్లో అంచనాలు పెంచితే తరువాత సినిమా కాస్త ఏ మాత్రం అటూ, ఇటూ అయినా కూడా అసలుకే మోసం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో ప్రొఫైల్ లో చేస్తున్నట్టు అనిపిస్తోంది.

ట్రైలర్ చుస్తే ప్రామిసింగ్ గా అనిపిస్తున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నెమ్మదిగానే ఉన్నాయి. ఏది ఏమైనా రవితేజ గత చిత్రం ఖిలాడీ లా కాకుండా ప్రేక్షకుల అంచనాలు అందుకొని రవితేజకు మరో ధమాకా అవుతుందని ఆశిద్దాం.

- Advertisement -

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు