Dasara : కలెక్షన్లు పెంచేందుకు దసరా టీం మాస్టర్ ప్లాన్..!

నాని నటించిన తొలి పాన్ ఇండియా సినిమా దసరా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే 80కోట్లకు పైగా గ్రాస్ ను సాధించి నాని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందించింది. యుఎస్ లో కూడా 2 మిలియన్ మార్క్ కి చేరువలో ఉంది దసరా. డెబ్యూ డైరెక్టర్ తో పాన్ ఇండియన్ హిట్ కొట్టినందుకు నాని గట్స్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ నటనకు కూడా క్రిటిక్స్ నుండి మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, నార్త్ సైడ్ దసరా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు, సినిమా యూనిట్ ని ఇప్పుడు అదే టెన్షన్ పెడుతున్నట్లు ఉంది.

వంద కోట్ల గ్రాస్ కు చేరువలో ఉన్న ఈ సినిమాకు ఈ వీక్ మొత్తం ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించటం చాలా కీలకం మరియు అదే విధంగా కష్టంతో కూడుకున్న పని. ఇందులో భాగంగానే మేకర్స్ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది, అదేంటంటే సెలెబ్రిటీల నుండి అప్రిసియేషన్ ట్వీట్స్ వేయించటం. గతంలో చాలా సినిమాలకు ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యింది కాబట్టి దసరా మేకర్స్ కూడా అదే ఫాలో అవుతున్నట్టు ఉంది. రాజమౌళి, హను రాఘవపూడి వంటి దర్శకులు మొదలుకొని పలువురు సెలబ్రిటీలు దసరా టీం అభినందిస్తూ ఈ రోజు ట్వీట్లు పోస్ట్ చేయటమే ఇందుకు నిదర్శనం.

అయితే కేవలం సెలెబ్రిటీల ట్వీట్లు మాత్రమే దసరాను గట్టెక్కిస్తాయి అనుకుంటే పొరపాటే, మౌత్ టాక్ కూడా చాలా ముఖ్యం. గతంలో కార్తీకేయ 2, బింబిసార సీతారామం సినిమాల విషయంలో మౌత్ టాక్ కీలకంగా పని చేసింది. ఫస్ట్ వీక్ లో నార్త్ ఆడియెన్స్ ని అంతగా మెప్పించలేకపోయాయి ఈ మూడు సినిమాలు. అయితే ఆ తర్వాత మౌత్ టాక్ తో పుంజుకొని బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకున్నాయి. దసరా విషయంలో కూడా ఇదే జరిగి నాని కెరీర్లో 100కోట్ల మైలు రాయిని చేరుకుంటాడని ఆశిద్దాం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు