SSMB28: సంక్రాంతికి సిద్ధమవుతున్న స్టార్ హీరోలు

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’ తో మెగా స్టార్, ‘వీర సింహ రెడ్డి’ తో నట సింహం బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇక 2024 సంక్రాంతి బరిలో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడనున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి సంక్రాంతి బరిలో దిగబోతున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్ కే‘. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని సంక్రాంతి బరిలోకి దిగనుంది. జనవరి 12, 2024 వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు మేకర్స్.ఈ సినిమాను వైజయంతి మూవీస్ వారు నిర్మించగా, దీపికా పదుకొనే, దిశా పాటని, అమితాబ్ బచ్చన్ వంటి ఎంతో మంది స్టార్ కాస్ట్ ఈ సినిమాలో కనిపించనున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘SSMB28’. ఈ సినిమా కు సంబందించిన మహేష్ ఫస్ట్ లుక్ తో పాటు, జనవరి 13, 2024న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు.ఇది మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న 3వ సినిమా. కాగా, ఈ సినిమా లో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు గా నటించగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

ఇక వీరి సినిమాలు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటాయి అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రభాస్ కెరీర్ లో మొదటి పాన్ వరల్డ్ సినిమా కావటం తో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు