Mahesh Babu: నందమూరి అల్లుడు అవ్వాల్సిన మహేష్ ని అడ్డుకుంది ఎవరో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచ నలుమూలలా జరిగే అనేక వింతలు, విశేషాలను ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం. గతంలో జరిగిన విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం అయినా ఇట్టే లీక్ అయిపోతుంది. తాజాగా ఇలాంటి లీకైన ఓ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదేంటంటే.. నందమూరి బాలకృష్ణ కు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు అన్న విషయం తెలిసిందే.

పెద్ద కూతురు బ్రాహ్మణిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు లోకేష్ కి ఇచ్చి వివాహం చేశారు. ఇక రెండవ కూతురు తేజస్వినిని గీతం సంస్థ ఫౌండర్ ఎంవీవిఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ తో వివాహం చేశారు. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ విషయానికి వస్తే అతను ప్రస్తుతం విదేశాలలో చదువు పూర్తి చేసుకుని సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అయితే బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణిని సూపర్ స్టార్ మహేష్ బాబు పెళ్లి చేసుకోవాల్సి ఉందని.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సంబంధం రిజెక్ట్ అయిందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి నందమూరి బాలకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అప్పట్లో నందమూరి తారక రామారావు, సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. అదే ఫ్రెండ్షిప్ ఆ తర్వాత జనరేషన్ లో కూడా ముందుకు వెళ్ళింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ.. మహేష్ బాబుని తన అల్లుడుగా చేసుకోవాలని అనుకున్నాడట. కానీ అప్పటికే మహేష్ బాబు – నమ్రత ప్రేమలో ఉన్నారని తెలిసి ఇరు కుటుంబాలు ఈ సంబంధాన్ని వద్దనుకున్నారని ఓ టాక్ వైరల్ అవుతుంది. అయితే ఈ న్యూస్ పై నందమూరి ఫ్యాన్స్ మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పెళ్లిళ్లు చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉన్న వారిపై ఇలా మాట్లాడుకోవడం మంచిది కాదని, దయచేసి ఈ వార్తను ఇక్కడితో ఆపేయాలని సజెస్ట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు