Haapy Birthday: గ్లోబల్ స్టార్ రాంచరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు ఇండియా లో ఈ పేరు తెలియని వారే లేరు. తండ్రి వారసత్వాన్నీ పునికి పుచ్చుకొని బాబాయి క్రేజ్ ని మ్యాచ్ చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చ్చుకొని ఇండస్ట్రీ లో నెంబర్ 1 రేసులో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సంధర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

మార్చి 27 )1985 లో చెన్నై లో మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించిన చరణ్ చిన్నతనం నుంచే తండ్రి అడుగు జాడల్లో బాబాయి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో పెద్దవాడయ్యాడు. చిన్నప్పుడే చరణ్ హార్స్ రైడింగ్లో సిద్ధహస్తుడు. తండ్రి కంటే పవన్ కళ్యాణ్ దగ్గరే ఎక్కువ పెరగడం వల్ల ఇండస్ట్రీ లో బాబాయ్ అలవాట్లే ఎక్కువగా వచ్చాయి.

2007 లో చిరుత సినిమాతో గ్రాండ్ గా ఇంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టి ఇండస్ట్రీ లో తన ముద్ర వేసాడు. ఈ సినిమా సృష్టించిన డెబ్యూ హీరో రికార్డ్ 13 ఏళ్ళు గా అలాగే ఉండగా దాన్నిఉప్పెన సినిమా బ్రేక్ చేసింది. ఇక మగధీర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2009 లో విడుదలైన ఆ సినిమా అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులని తిరగరాసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఆ వెంటనే విడుదలైన ఆరెంజ్ డిసాస్టర్ కాగా రీ రిలీజ్ అయ్యి మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత రచ్చ,నాయక్ వంటి వరుస హిట్లతో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపించగా జంజీర్ తో బాలీవుడ్ డెబ్యూ ఇవ్వగా ఆ సినిమా డిసాస్టర్ అయింది. ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ సినిమాలతో సందడి చేసిన చరణ్ కి హిట్స్ వస్తున్నా సినిమాల సెలక్షన్స్ పరంగా, లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు.

- Advertisement -

అప్పుడే రామ్ చరణ్ తన రూటు మార్చి కొత్తగా ప్రయోగాలు చేసాడు, ధ్రువ లో సరికొత్తగా కనిపించిన రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీసాఫిసర్ గా మంచి కంబ్యాక్ హిట్ కొట్టాడు. తర్వాత విడుదలైన రంగస్థలం అప్పటి వరకు  లో మనం ఊహించలేనంతగా డిఫరెంట్ గా మేకోవర్ చేసి తానేంటో తెలియచెప్పాడు,తన నటనతో యావత్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేసాడు. తన నటన పై విమర్శలు చేసిన యండమూరి లాంటి వాళ్లకు తన నటనతో గట్టి సమాధానం ఇచ్చాడు. ఈ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మధ్యలో వినయ విధేయ రామ,ఆచార్య వంటి ప్లాపులు వచ్చినా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఎన్టీఆర్ తో కలిసి చేసిన మల్టీస్టారర్ తో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా చూపించాడు.

రామ్ చరణ్ 2012 లో అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలైన ఉపాసన కామినేని ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇండస్ట్రీ లో ఈ జంటకు బెస్ట్ కపుల్ గా మంచి పేరుంది.ఇక రీసెంట్ గా చిరు పెట్టిన పోస్ట్ తో చరణ్ తండ్రి కాబోతున్నాడని తెలిసింది. ఇండస్ట్రీ లో రామ్ చరణ్ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ మంచి మనిషిగా అభిమానులను ఒక అన్నదమ్ముల్లా చూస్తాడు. ఇక రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ రానా, శర్వానంద్ స్కూల్ టైం నుంచి క్లాస్ మేట్స్ అని తెలిసిందే.

ప్రస్తుతం శంకర్ తో మూవీ చేస్తున్న రామ్ చరణ్ తర్వాత సాన బుచ్చిబాబు తో సినిమా చేస్తున్నాడు. ఈరోజు అనగా మార్చి 27 న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు