Keerthy Suresh: మహానటికి బ్రేకప్ అయింది నిజమేనా..?

ఏ పాత్రను అయినా అలవోకగా, ఈజ్ తో చేసే నటి కీర్తి సురేష్. అందుకే ఈమెకు మహానటి సావిత్రి బయోపిక్ లో నటించే ఛాన్స్ వచ్చింది. అలాగే ఈ తరం మహానటి అయింది. కీర్తి సురేష్ నటించే సినిమాలు ఫ్లాప్ అయినా, నటనకు మాత్రం మంచి మార్కులు పడతాయి. తాజాగా ఈ మహానటి.. నానితో కలిసి దసరా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో దసరా ప్రమోషన్స్ ను పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా చేస్తున్నారు. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ కల్లు తాగింది. ఈ వీడియో ఫుల్ వైరల్ అయింది. ఇది సినిమాకు చాలా హెల్ప్ అయింది. తాజాగా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. దీనిలో ఈమె ఇచ్చిన ఆన్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మంచు చేదు ఉంటుందా..? బ్రేకప్ చేదు ఉంటుందా.. ? అనే ప్రశ్న వస్తే మందు కంటే.. బ్రేకప్ చేదుగా ఉంటుందని కీర్తి చెప్పేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.

కాగా, కొన్ని రోజుల క్రితం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కీర్తి లవ్ లో ఉందని, అలాగే రిలేషన్ షిప్ లో కూడా ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు అంటూ న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తర్వాత వీరి మధ్య బ్రేకప్ అయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అనిరుధ్ గానీ, కీర్తి సురేష్ గానీ ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా బ్రేకప్ పై ఈ వ్యాఖ్యలు చేయడంతో కీర్తికి నిజంగానే బ్రేకప్ అయిందని నెటిజన్లు భావిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు