Ileana: బోల్డ్ కామెంట్స్

ఘగన సుందరి.. నడుము మంజరి.. గోవా బ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలి రా అంటూ ఇలా చాలా పేర్లతో ఇల్లీ బేబీని అభిమానులు పిలిచేవారు. ఈ గోవా బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అసలు తెలుగులో ఇలియానా అంత త్వరగా స్టార్ హీరోయిన్ అయిందంటే కారణమే ఫిజిక్. ముఖ్యంగా నడుము సోయగాలతో అప్పట్లో తీపి నరకం చూపించేది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉందని చెప్పాలి. అయితే ఓ ఇంటర్వ్యూలో ఇలియానా చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలియానా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోల్డ్ కామెంట్స్ చేయడం మామూలే.

ఈ క్రమంలో ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి చేసిన కామెంట్స్ ట్రెండింగ్ లో నిలిచాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను శృంగారాన్ని ఎంజాయ్ చేస్తానని తెలిపింది. దానిని ఒక వ్యాయామంగా భావిస్తానని.. అందరూ దాన్ని అలాగే భావించాలని సూచించింది. అయితే శృంగారం వల్ల ఒక జంట మధ్య బంధం బలపడుతుందని, దీంతోపాటు ఎన్నో ఎమోషన్స్ కూడా అటాచ్ అవుతాయని పేర్కొందిి. అంతేకాదు పెళ్లి కాకుండానే ఆమె సెక్స్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కామెంట్స్ తో ఈమెలో ఇలాంటి కోణం కూడా ఉందా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు