Samyuktha Menon: టాలీవుడ్ లేడి లక్కుకు పుట్టిన రోజు శుభాకంక్షలు

Samyuktha Menon

ప్రస్తుతం టాలీవుడ్ లేడి లక్కుగా కొనసాగుతున్న సంయుక్త మీనన్ గురించి అందరికి తెలిసిందే.. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుస సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ యంగ్ హీరోలకు లేడి లక్కుగా దూసుకుపోతుంది.

మలయాళంలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంయుక్త మీనన్ ఇప్పటి వరకు తెలుగులో 4 నాలుగు సినిమాలలో నటించింది. మొదటి సినిమా భీమ్లా నాయక్ సూపర్ హిట్ అవ్వడంతో అందరి అటెన్షన్ కొట్టేసిన ఈ కేరళ కుట్టి ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమాలో నటించింది. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దాంతో సంయుక్త మీనన్ ఖాతాలో బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇక ఈ రెండు సినిమాల తరువాత ధనుష్ తో సార్, సాయి ధరమ్ తేజ్ తో విరూపాక్ష సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సంయుక్త . అలాగే ఆమె నటించిన అన్నీ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అవడంతో సంయుక్త మీనన్ ఉంటెచాలు సినిమా సూపర్ హిట్ అనే బలమైన ముద్ర ఇండస్ట్రీలో పడిపోయింది.

- Advertisement -

విరూపాక్ష సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న సంయుక్త మీనన్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో డెవిల్ అనే సినిమాలో నటిస్తుంది. అభిషేక్ అగర్వాల్ బ్యానర్ పై నవీన్ మేడారం దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నవంబర్ 24 న రిలీజ్ అవ్వబోతుంది. గతంలో కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమాలో కలిసి నటించిన సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో మరోసారి జతకట్టింది. ఇటీవలనే అమిగోస్ సినిమా ఫ్లాప్ తో దెబ్బ తిన్న కళ్యాణ్ రామ్ కు మరీ ఈసారి కూడా సంయుక్త మీనన్ లేడి లక్కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు