Abhishek Pictures: మొన్న పతివ్రతలాగా కూతలు కూసి.. ఈరోజు చేసిన పనికి మాలిన పని ?

 ABHISHEK PICTURES

ఒకరిని వేలు పెట్టి చూపించే ముందే ఆలోచించుకోవాలి రేపు అదే తప్పు మనం చేస్తే మనల్ని తిరిగి నాలుగు వేళ్ళు ప్రశ్నిస్తాయని. ఇటీవలనే వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఒక స్టార్ హీరో స్పీడ్ కు బ్రేక్ వేసి భారీ డిజాస్టర్ ను అందించిన ఒక పేరున్న పెద్ద ప్రొడక్షన్ హౌస్ కొద్దిరోజుల క్రితమే ఒక యంగ్ హీరోపై ఒక పనికి మాలిన కామెంట్ చేసి వివాదానికి తెర లేపింది. అయితే ఆ వివాదం జరిగి సరిగ్గా పది రోజులు కూడా గడవనే లేదు అంతలోనే మరో వివాదం నెత్తిన వేసుకొని మరోసారి వార్తల్లోకెక్కింది ఆ పేరున్న ప్రొడక్షన్ హౌస్

ఇంతకు ఆ పేరున్న పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఏది అని అనుకుంటున్నారా అదేనండీ అభిషేక్ పిక్చర్స్..
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అభిషేక్ నామా గత కొన్నేళ్లుగా పలు సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలనే ఈయన విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాపై ఒక కామెంట్ చేసారు. విజయ్ దేవరకొండ సమంత కలిసి నటించిన ఖుషి సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా విజయ్ తన అభిమానుల కుటుంబాలకు ఒక కోటి రూపాయలు గిఫ్ట్ గా ఇస్తున్నట్టు ప్రకటించాడు. అయితే దానికి కౌంటర్ గా అభిషేక్ పిక్చర్స్ తాము కూడా విజయ్ దేవరకొండ గత చిత్రమైన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా వల్ల 8 కోట్ల వరకు నష్టపోయామని తమని కూడా విజయ్ దేవరకొండ ఆదుకోవాలని కౌంటర్ వేశారు. దాంతో పెద్ద ప్రొడక్షన్ అయ్యుండి ఈ విధంగా ప్రవర్తించడం వల్ల అభిషేక్ నామా అందరి చేత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఇక లేటెస్ట్ గా చూస్తే ఈ పెద్ద మనిషి ఆయన ప్రొడక్షన్ నుంచి వస్తోన్న కొత్త చిత్రం డెవిల్ ది బ్రిటిష్ ఏజెంట్ సినిమా నుంచి ఏకంగా డైరెక్టర్ పేరునే తోలగించాడు. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్స్ గా వస్తోన్న ఈ డెవిల్ సినిమాను నిజానికి నవీన్ మేడారం అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఇటివలనే షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా నవంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

- Advertisement -

అయితే ఈ రోజు డెవిల్ సినిమాలో నటిస్తోన్న సంయుక్త మీనన్ పుట్టినరోజు అవడంతో ఆమెకు పుట్టినరోజు విషెష్ చెబుతూ ఒక పోస్టర్ అభిషేక్ పిక్చర్స్ రిలీజ్ చేసారు. అయితే ఆ పోస్టర్ లో ఏ ఫిలిం బై డైరెక్టర్ పేరు ఉండాల్సిన చోట అభిషేక్ పిక్చర్స్ అని ఉండటం గమనార్హం. అలాగే గత కొద్దిరోజులుగా డెవిల్ సినిమాకు సంబంధించిన ఏ పోస్ట్ లోను డైరెక్టర్ నవీన్ మేడారం ఇన్వవాల్వ్ చేయడం లేదు ప్రొడ్యూసర్ అభిషేక్ నామా. పైగా డైరెక్టర్ కు ఇవ్వాల్సిన ఆ ఫిలిం బై అనే టాగ్ లో కూడా తన ప్రొడక్షన్ హౌస్ పేరు వేసుకోవడం ప్రస్తుతం వివాదాస్పదమవుతుంది. దాంతో ప్రస్తుతం నెటిజన్లు అభిషేక్ పిక్చర్స్ ను మొన్న పతివ్రతలాగా కూతలు కూసి ఈరోజు మీరు చేసిందేంటని ప్రశ్నిస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు