Shriya saran: శ్రియ ఆ టాలీవుడ్ హీరోని ప్రేమించిందా..?

Shriya saran

అందాల తార శ్రియ శరన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. దాదాపు 20 సంవత్సరాలుగా టాలీవుడ్ లో తనదైన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన ఈమెలో ఇప్పటికీ హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది.

ఇక శ్రీయ తన కెరీర్ ఆరంభంలో లవర్ బాయ్ తరుణ్ కి జోడీగా నువ్వే నువ్వే చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి 20 సంవత్సరాలు దాటింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే. స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది మూవీ యూనిట్.

ఈ కార్యక్రమంలో శ్రీయ, హీరో తరుణ్, దర్శకుడు త్రివిక్రమ్, నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీయ హీరో తరుణ్ ని గట్టిగా వాటేసుకొని ముద్దుల వర్షం కురిపించింది. దీంతో ఇది చూసిన వారంతా శ్రీయ తరుణ్ ని ప్రేమిస్తుందా అనే అపోహలో పడిపోయారు. అయితే నువ్వే నువ్వే సినిమాలో నటించిన సమయంలోనే శ్రీయ తరుణ్ నీ ఇష్టపడిందని అప్పట్లో పుకార్లు ఉండేవి. కానీ ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ కావడంతో ఇద్దరూ విడిపోయారని, ఇక తరుణ్ ఆర్తి అగర్వాల్, ఆ తర్వాత ప్రియమణితో కూడా ప్రేమాయణాలు నడిపాడన్న పుకార్లు వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు