Naveen polishetty: బొమ్మరిల్లు ఫాదర్ – బ్లాక్ బస్టర్ హీరో

Naveen polishetty:

నవీన్ పోలిశెట్టి, ఇప్పుడు ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. గత నాలుగేళ్లలో 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి అని కాకుండా నచ్చిన ప్రతి పాత్రను , కథను ఖచ్చితంగా వాడుకోవాలి అనుకునే రకం. హీరో అవ్వడానికంటే ముందే “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” అండ్ “1 నేనొక్కడినే” వంటి సినిమాల్లో కనిపించి కొంత గుర్తింపు తెచ్చుకున్న నవీన్. Aib వీడియోస్ తో యూత్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు.

కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న నవీన్ “ఏజెంట్ సాయి శ్రీనివాసా” ఆత్రేయ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత వచ్చిన “జాతి రత్నాలు” సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రీసెంట్ గా “మిస్టర్ శెట్టి, మిసెస్ పోలిశెట్టి” సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నవీన్.

NIT భోపాల్ లో బి.టెక్ పూర్తి చేసిన తరువాత కొన్నేళ్లు పాటు అమెరికాలో టెలి కాలర్ గా జాబ్ చేసాడు. చిన్నప్పటి నుండి సినిమాలపై మక్కువతో రకరకాల పనులు చేసుకుంటూ వచ్చాడు నవీన్. నవీన్ 10th క్లాస్ చదువుతున్న టైం లో ఒక ట్రైన్ లో జర్నీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆ కంపార్ట్మెంట్ క్లీన్ చేస్తున్నాడు. తనకు నవీన్ కొంత డబ్బులు ఇవ్వబోయాడు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఒక యాక్టింగ్ స్కూల్ (National School of Drama) స్టూడెంట్ అని తన యాక్టింగ్ స్కిల్స్ ను ప్రూవ్ చేసుకోవడానికి ఇలా చేస్తున్న అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

అప్పటినుండి నటనపై ఆసక్తి ఇంకా పెరుగుతూ వచ్చింది నవీన్ కి. కానీ నవీన్ యాక్టర్ అవ్వడం ఇంట్లో అప్పటికి ఇష్టం లేదు. బొమ్మరిల్లు సినిమాలో ఫాదర్ అడిగినది మాత్రం ఇవ్వడకుండా అంతకు మించి ఇచ్చే రకం.ఎట్టకేలకు నవీన్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ లో చాలామందికి ఫేవరెట్ హీరో అయిపోయాడు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు