Jawan: కోడి కూతలో సంగీతాన్ని చూసిన మహానుభావుడు

Jawan:

18 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ సినిమాలోనే ‘కొలవెరి’ పాటతో వెర్రెత్తించిన అనిరుధ్.. చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. విజయ్, రజనీకాంత్, అజిత్.. ఇలా చాలామంది సూపర్ స్టార్ల సినిమాలకు సంగీతం అందించాడు. ఇప్పుడు తమిళంలో అతనే నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అతిశయోక్తి లేదు.

కేవలం సినిమాలతోనే కాక మ్యూజికల్ కన్సర్ట్‌లతో యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అనిరుధ్. రీసెంట్ టైమ్స్ లో అనిరుద్ మ్యూజిక్ వలనే కేవలం కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. విక్రమ్ , జైలర్ , జవాన్ వంటి సినిమాల్లో అనిరుధ్ మ్యూజిక్ కీలక పాత్రను పోషించింది.

ఇకపోతే వరుస ఫెయిల్యూర్ సినిమాలు తరువాత “జైలర్” సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు తలైవర్. నెల్సన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కంటే ముందు నెల్సన్ చేసిన బీస్ట్ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎట్టకేలకు జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలక్షన్స్ వర్షం కురిసేలా చేసాడు నెల్సన్. ఈ సినిమాలో హుకుం పాట చాలా బాగా ఫేమస్ అయింది. ఈ పాటలోని లిరిక్స్ ను ఉపయోగిస్తూ రీసెంట్ గా రామ్ పోతినేని బాలయ్యకు ఎలివేషన్ కూడా ఇచ్చాడు.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ వీడియో సారాంశం ఏంటంటే ఒక కోడి డిఫెరెంట్ గా కూయడం మనం గమనించవచ్చు. ఆ వీడియో లో కూతను ఆధారంగా చేసుకుని అనిరుధ్ ఈ పాటను కంపోజ్ చేసాడు అని కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు