Maharaja: మక్కల్ సెల్వన్ మైల్ స్టోన్ మూవీ… ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్!

Maharaja:

తమిళ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మక్కల్ సెల్వన్ గా తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఈ విలక్షణ నటుడు సౌతిండియా భాషల్లోనే గాక ఇప్పుడు హిందీలోనూ పాగా వేసాడు. ఈ మధ్యనే ఫార్జి అనే వెబ్ సిరీస్ లో నటించగా, ఇప్పుడు పాన్ ఇండియా హిందీ మూవీ జవాన్ లో షారుఖ్ ఖాన్ కి ప్రతి నాయకుడిగా తన విలక్షణ నటనతో సినిమాకే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు.

అటు హీరోగానూ తన సినిమాలు చేస్తూనే ఉన్నాడు. విక్రమ్ వేద, 96 వంటి సినిమాల్లో ఎంతో హృదయాన్ని కలిగించే పాత్రలు చేసిన విజయ్ సేతుపతి తాజాగా తన సినిమా కెరీర్ లో మైల్ స్టోన్ ని అందుకున్నాడు. విజయ్ సేతుపతి ప్రస్తుతం నటిస్తున్న “మహారాజా” సినిమాతో 50 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ గుర్తు చేస్తూ తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో ఇంటెన్స్ రఫ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆ స్టిల్ లో విజయ్ సేతుపతి కత్తి పట్టుకుని పోలీసుల ముందు కూర్చుని ఉన్న స్టిల్ లో భావోద్వేగం తో కూడిన ఎక్స్ప్రెషన్ తో అదరగొట్టాడు.

నిథిలన్ సామినాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక దెబ్బతిన్న కామన్ మాన్ గా కనిపిస్తున్నాడని ఆ డ్రెస్సింగ్ స్టయిల్ ని బట్టి తెలుస్తుంది. ఈ సినిమాతో విజయ్ సేతుపతి పెర్ఫార్మన్స్ లో మరో మెట్టు ఎక్కుతాడని చెప్పవచ్చు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు