Peddha Kapu 1: పెద కాపు.. పవన్ కళ్యాణ్ లైఫ్ స్టోరీనా శ్రీకాంత్ అడ్డాల స్ట్రాంగ్ రిప్లై ?

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తోన్న పెద కాపు ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలయింది. గతంలో కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ తో తీసిన నారప్ప సినిమాతో తన పంథాను పూర్తిగా మార్చేశాడని చెప్పవచ్చు.

తమిళ్ లో సూపర్ హిట్టైన అసూరన్ రీమేక్ గా తెరకెక్కిన నారప్ప సినిమా కరోనా కారణంగా ఓటిటిలో విడుదలయింది. పూర్తిగా క్లాస్ సినిమాలు తీసే శ్రీకాంత్ అడ్డాల రస్టిక్ యాక్షన్ సబ్జెక్ట్ అయిన నారప్ప సినిమాను ఎలా తీస్తాడో అని అందరిలో కన్ఫ్యూజన్ ఉండింది. కానీ శ్రీకాంత్ అడ్డాల మాత్రం నారప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా సినిమాను తీసి, తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక నారప్ప తరువాత శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ అదే తరహాలో కుల అనే టాపిక్ ను ఇతివృత్తంగా.. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో పెద కాపు అనే సినిమాను తీస్తున్నాడు. అఖండ సినిమా ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

- Advertisement -

రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో పెద కాపు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అలాగే మీడియాతో ప్రెస్ మీట్ లో కూడా పాల్గొంది మూవీ టీం. పెద కాపు అనే టైటిల్ సినిమాకు పెట్టడం గురించి శ్రీకాంత్ అడ్డాలను పలువురు ప్రశ్నలు అడగగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎవరిని నొప్పించకుండా అన్నీ ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ను హీరోను చేస్తూ ఈ పెద కాపు సినిమా తీసారా అని శ్రీకాంత్ అడ్డాలను అడగగా ఆయన సమాధానం ఇస్తూ ఇది పవన్ కళ్యాణ్ కథ కాదు ప్రతి సామాన్యుడి కథ అని రిప్లై ఇచ్చాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు