Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్

2000వ దశకం ప్రారంభంలో, ఇష్టం సినిమాతో తెలుగువారిని పలకరించి ఆ తరువాత స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శ్రియ శరణ్. ఈ హీరోయిన్ అప్పట్లో నటించని హీరో లేదు అంటే అతిశయోక్తి లేదు. చిరంజీవి, నాగార్జున దగ్గరనుంచి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వరకు అలానే ఉదయ్ కిరణ్ మరియు రాజా వరకు ప్రతి హీరోతో నటించింది ఈ హీరోయిన్.

కొన్ని సంవత్సరాల పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ ప్లేస్ లో కొనసాగి ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది శ్రియ. ఇక ఆ తరువాత రజినీకాంత్ శివాజీ సినిమాతో తమిళ వారికి కూడా దగ్గరయింది. కానీ ఈ హీరోయిన్ కెరియర్ లో తెలుగు సినిమాలకి ప్రత్యేక స్థానం తప్పక ఉంది. ఎందుకంటే ఈ హీరోయిన్ ని తెలుగులో ఇప్పటికీ కూడా అభిమానించే అభిమానులు ఎందరో. దానికి తగ్గట్టుగానే నాలుగు పదులు వయసు వచ్చిన ఇక రెండు పదులు వయసులానే కనిపిస్తూ ఉంటుంది శ్రియ.

గత కొద్దిరోజులుగా తెలుగులో పెద్దగా హీరోయిన్గా కనిపించని శ్రియ, ఇప్పటికీ తెలుగులో హీరోయిన్గా కొనసాగుతూ ఉంటే 40 ఏళ్ల వయసులో కూడా బికినీ స్టంట్స్‌తో బాలీవుడ్ వెండితెరను ఓ ఊపు ఊపుతున్న దీపికా పదుకొణె లాగా మనకి తెలుగులో వెండితెరకి శ్రియ అయ్యి ఉండేదని కొందరు అంటున్నారు.

- Advertisement -

అయితే, శ్రియ యొక్క ప్రస్తుత స్పైసీ లుక్స్ ప్రకారం, ఆమె చాలా మంది సీనియర్ తెలుగు హీరో మళ్లీ కొత్త ఎంపికగా మారినట్లు కనిపిస్తోంది. ఈమధ్య అజయ్ దేవగన్ తో దృశ్యం 3 సినిమాతో హిందీలో సూపర్ సక్సెస్ సాధించింది హీరోయిన్. మరో రోజు హైదరాబాద్‌లో జరిగిన ఉపేంద్ర కబ్జా సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రియ అద్భుతంగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం సీనియర్ హీరోలు అభినయం, గ్లామర్ రెండూ కలగలిసిన నటీమణులను వెతుక్కోవడానికి చాలా కష్టపడుతున్నారు. అయితే శ్రియా కి రెండు ఉన్నాయి.
అందుకే ఇప్పుడు మళ్లీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ లాంటి హీరోలకి హీరోయిన్ గా శ్రీయ నే తీసుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త నిజమైతే మళ్లీ శ్రీయ అభిమానులకు పండగ మొదలైనట్టే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు