సినిమా ఫట్ , నో ప్రాఫిట్

కొరటాల శివ
మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను కమర్షియల్ వే లో చెప్పడం ఈయన స్టైల్. “ఆచార్య” సినిమాను మినహాయిస్తే ఇప్పటివరకు ప్లాప్ తెలియని,తీయని సక్సెస్ ఫుల్ డైరెక్టర్. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి వరుస హిట్ లను కొట్టిన కొరటాల శివ కు అదృష్టం వరించి చిరంజీవి లాంటి స్టార్ హీరో తో సినిమా ఒకే అయింది, కానీ దురదృష్టం దాన్ని ప్లాప్ రూపంలో తన్నుకెళ్లింది.

మెగాస్టార్ తో సినిమా చేయడం అనేది ప్రతి డైరెక్టర్ కు ఒక కల,
ఆ కల నిజమై సినిమా చేసాక అది ప్లాప్ అయితే అది పీడ కల.
ఇప్పుడు ఆచార్య సినిమా కూడా కొరటాల శివను ఒక పీడకల లా వెంటాడుతుంది అని చెప్పొచ్చు. మాములుగా చాలామంది దర్శకులు ఒక పెద్ద హీరోతో సినిమాను చేస్తున్నాం అంటే భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఆ పెద్ద హీరోలే పిలిచిమరి సినిమా చేయమంటే దర్శకులు భారీగా రెమ్యునరేషన్ అడిగిన సందర్బాలు ఉన్నాయ్.


కానీ కొరటాల శివ ఈ రెండు చెయ్యలేదు, ఆచార్య మూవీ కి అసలు రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా, కొన్ని ఏరియాల్లో సినిమాకి వచ్చిన లాభాల్లో కొంత శాతం తీసుకోవాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆచార్య సినిమాను తీసుకున్న డిస్టిబ్యూటర్స్ కొంత నష్టాల్లో ఉన్నారు. మరి ఇప్పుడు కొరటాల శివకి ఏమొస్తుంది, నాలుగు సంవత్సరాల టైం, ఇప్పటివరకు ఆయనకు ఉన్న పేరు ఈ ఆచార్య సినిమా తో కొంత తగ్గింది అని చెప్పొచ్చు. మరి తరువాత తారక్ తో చేయబోయే సినిమాతో విమర్శలకు చెక్ పెడతాడేమో వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు