వరంగల్ శీను ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది.
దర్శకుడిగా ఎదగాలనుకునే వరంగల్ శీను డిస్ట్బ్యూటర్ గా అడుగులు వేసి తనకంటూ ఒక పేరును సాధించుకున్నాడు.
అలానే డిస్ట్బ్యూటర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి అగ్ర నిర్మాతగా ఎదిగారు దిల్ రాజ్. ఇళయదళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా టైం లో వీల్లద్దరి మధ్య థియేటర్స్ విషయంలో వాగ్వాదం జరిగిన విషయం మనకు తెలిసిందే. అప్పటినుంచి ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా నైజం హక్కులు కోసం ఇద్దరు పోటీ పడుతుంటారు.
అలానే ఆచార్య సినిమా హక్కులు కోసం కూడా ఇద్దరు పోటీ పడ్డారు.
ముందు ఆచార్య సినిమా నైజం హక్కులు కోసం 30 కోట్లు వరకు చెల్లించి దిల్ రాజు తీసుకున్నారు. వరంగల్ శీను కి ముందునుంచే దిల్ రాజు మీద ఉన్న కోపంతో రివెంజ్ తీసుకోవాలి అనే ఆలోచనలో 42 కోట్లు పెట్టి ఆచార్య సినిమా హక్కులను దక్కించుకున్నారు.
కానీ ఊహించని విధంగా “ఆచార్య” సినిమా తీవ్ర నష్టాలను చవిచూసింది.
ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలను కొంటూ ఎదుగుతూ వస్తున్న తరుణంలో ఈ సినిమా ఫలితం వరంగల్ శీను కి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. మొత్తానికి దిల్ రాజ్ అలా సేఫ్ జోన్ లో ఉండిపోయారు.