ఒకప్పుడు గొప్ప సినిమాలు, అందమైన లవ్ స్టోరీలు అన్ని బాలీవుడ్ లో వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ బాలీవుడ్ ప్రేక్షకులకు ఎటువంటి సినిమాలు కావాలో బాలీవుడ్ దర్శకులకే అంతు చిక్కడం లేదు.
అక్కడ స్టార్ హీరోస్ చేస్తున్న ఏ సినిమాకి తగిన ఆదరణ లభించడం లేదు.
ప్రస్తుతం తెలుగు సినిమాలకి, కన్నడ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు బాలీవుడ్ ఆడియన్స్. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన 83 సినిమా బాగున్నా పూర్తి స్థాయిలో కలక్షన్స్ రాబట్టలేకపోయింది.
ప్రభాస్ నటించిన రాధే శ్యాం, యాష్ నటించిన కెజిఫ్ , రాంచరణ్ తారక్ కలిసి చేసిన ట్రిపుల్ ఆర్, అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమాలు మొదటి రోజే అద్భుతమైన కలక్షన్స్ తీసుకుని వచ్చాయి.
రీసెంట్ గా హిందీలో రిలీజ్ అయినా జెర్సీ, రన్ వే 34 , హీరోపంటి 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించిన బాలీవుడ్ లో ఇప్పుడు తెలుగు సినిమాలు పాగా వేస్తున్నాయి అని చెప్పొచ్చు.