సర్కార్ వారి పాట – ఇది కంప్లీట్ ఫ్యాన్స్ స్టఫ్

సూపర్ స్టార్ మహేష్ బాబు
కామిక్ టైమింగ్ , డైలాగ్ డెలివరీ లో ఈయనను కొట్టినోడు లేడు.
సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా సినిమా ట్రైలర్ ను ఆఫీసియల్ గా రిలీజ్ చేసారు.

ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే హిట్టు కల కనిపిస్తుంది అని చెప్పొచ్చు.
మాములుగా డైలాగ్స్ చెప్పడంలో మహేష్ బాబు దిట్ట, రాయడంలో పరశురామ్ దిట్ట వీల్లద్దరి కాంబినేషన్ బాగానే వర్కౌట్ అయింది అనిపిస్తుంది.

మహేష్ మునుపెన్నడూ లేనంత అందంగా కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. మాములుగా మహేష్ బాబు అభిమానులు ఏమి కోరుకుంటారో అవన్నీ దట్టించి పెట్టాడు పరశురామ్ ఈ ట్రైలర్ లో.
మహేష్ బాబు , కీర్తి సురేష్ మధ్య కెమిస్ట్రీ చుడముచ్చటిగా అనిపిస్తుంది.
మాములుగా గా డైలాగ్స్ చెప్పటమే కాకుండా ఒక యాసలో కూడా డైలాగ్ చెప్పి అట్రాక్ట్ చేసాడు మహేష్. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు