Bholaashankar: వింటేజ్ ఫీల్ ఇస్తున్న మెగా మెలోడీ..!

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో భోళాశంకర్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి థర్డ్ సింగిల్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. తమన్నా, చిరంజీవి మధ్య పిక్చరైజ్ చేసిన ఈ కలర్ ఫుల్ మెలోడీ సాంగ్ మణిశర్మ ఫ్లేవర్ తో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ లో చిరు స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ తో ఆకట్టుకోగా, ఈ సాంగ్ లో చిరంజీవి, తమన్నా మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. మిల్కి బ్యూటీ నువ్వేనా స్వీటీ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ చిరు స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. రొటీన్ మాస్ మసాలా రీమేక్ అంటూ నిరుత్సాహంతో ఉన్న మెగా ఫ్యాన్స్ కి ఈ సాంగ్ కొంచెం బూస్టప్ ఇచ్చేలా ఉందని చెప్పాలి.

మహతి స్వర సాగర్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సాంగ్ మణిశర్మ ని గుర్తు చేసేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. సినిమా కథ రొటీన్ మాస్ మసాలా అయినప్పటికీ ఇందులో చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేశామని, ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని స్క్రీన్ పై చూడబోతున్నామని డైరెక్టర్ మెహర్ రమేష్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవలే చిరు లీక్స్ అంటూ రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తున్న షాట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

కీర్తి సురేష్ ఇందులో చిరుకి చెల్లెలి క్యారెక్టర్లో నటించగా కీర్తికి జోడిగా సుశాంత్ నటించాడు. ఈ ఇయర్ బిగినింగ్ లో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవికి భోళాశంకర్ సినిమా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి, కేవలం చిరంజీవి క్రేజ్ ఒక్కటే పాజిటివ్ అంశంగా వస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు