Sai Rajesh: పల్స్ పసిగట్టాడు

నేనింతే సినిమాలో రవితేజ క్యారం బోర్డు ఆడుతూ, ఎదురుగా ఉన్న వేణు మాధవ్ తో ఒక డైలాగ్ చెప్తాడు. “ఈ కాయిన్ ఇక్కడ నుంచి వేస్తే పడిపోద్ది అని నీకు తెలుసు , నాకు తెలుసు కానీ అన్ని సార్లు వెయ్యలేము. “మనకు అర్ధం కానీ విషయం ఏంటంటే… అని చెప్తూ క్యారం పిక్కలను అన్ని ఒక దగ్గర పెట్టి స్ట్రైకర్ తో లాగి కొడతాడు, పిక్కలు తలోవైపుకు చెదిరిపోతాయి. సినిమా కూడా ఇంతే కన్సీక్వేన్సస్ ఏది ఎటు ఎళ్తుందో తెలియదు” అంటాడు.

ఇక అసలు విషయానికి వస్తే, రీసెంట్ గా కలక్షన్స్ సునామీ సృష్టితున్న సినిమా “బేబీ”. ఇదివరకే హృదయ కాలేయం, కొబ్బరిమట్ట వంటి సెటైరికల్ సినిమాలను తెరకెక్కించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకుడు. కానీ బేబీ సినిమా మొదలైన రోజు నుంచి ఈ కథతో , ఈ పాత్రలతో , ఈ సినిమాతో తాను ప్రేమలో పడుతూ , ప్రాణంతో రాసుకున్న అని చెబుతూనే వచ్చాడు దర్శకుడు సాయి రాజేష్. అలానే ఈ సినిమా పోస్టర్స్ కూడా మంచి ఆసక్తిని కలిగించాయి. మొదటి ఒక గోడపై పిచ్చి పిచ్చి రాతల మధ్య టైటిల్ వేసి బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ రిలీజ్ చెయ్యడం.

- Advertisement -

ఈ పిచ్చి పిచ్చి రాతలను కొండలపై , గుట్టలపై, గోడలపై చూడటం వెరీ కామన్ & చాలా మందికి నోస్టాలిజీయా వైబ్, సో ఇక్కడితో చాలామందికి ఒక ఆసక్తి కలిగింది. ఆ తరువాత లవర్స్ డే టైం లో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక బైక్ , ఆ పక్కనే ఒక స్కూటీ ని నిలబెట్టి దానికి ఒక చున్నీని చుట్టడంతో ఉన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చెయ్యడం కూడా ఇంకొంతమందికి బాగా కనెక్ట్ అయింది.

వీటన్నింటిని మించి ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్. ఈ సినిమా టీజర్ లోనే చాలామందికి ఒక వైబ్ క్రియేట్ అయింది అంటే కారణం విజయ్ అందించిన మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. ఓ రెండు ప్రేమ మేఘాలు అంటూ అలా శ్రోతలను ఆకాశమేఘాల్లో తేలేలా చేసాడు తన మ్యూజిక్ విజయ్. అలానే సినిమాలో కూడా ప్రతిసీన్ కి తనదైన రీతిలో మెప్పించాడు.

ఎట్టకేలకు ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ముందురోజే హైదరాబాద్ లో ప్రీమియర్స్ షోస్ ఏర్పాటు చేసారు. సినిమాకి మొదటి మిశ్రమ స్పందన లభించింది, కొందరు ల్యాగ్ అన్నారు, ఇంకొందరు నిబ్బా నిబ్బి సినిమా అన్నారు, నా జీవితాన్ని మించిన దరిద్రం దీనిలోనే ఉంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ దర్శకుడు సాయి రాజేష్ కి తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు.

కానీ దర్శకుడు సాయి రాజేష్ దృష్టిలో ఉన్న ఆడియన్స్ వేరు, అంటే వాళ్ళకి మాత్రమే ఈ సినిమానా అంటే, అది కాదు. కానీ కొంతమంది ఈ సినిమాకు బ్రహ్మరథం పడతారు అని సాయి రాజేష్ ముందే గ్రహించాడు. ఏ సినిమా జాతకాన్ని అయినా అల్టిమేట్ గా డిసైడ్ చేసేది ప్రేక్షకులు.

అందుకే చాలామంది సినీ ప్రముఖులు ప్రేక్షకదేవుళ్లు అని కొనియాడుతారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు అంటే ఎక్కువశాతం కాలేజ్ కుర్రాళ్ళు ఉన్నారు. దానికి తోడు ఇప్పుడే కాలేజ్ లు కొత్తగా స్టార్ట్ అవ్వడం , దానికి తోడు అప్పుడే క్లాస్ లు స్టార్ట్ కాకపోవడంతో దాదాపుగా అందరికి అందుబాటులో వినోదం సినిమాయే కాబట్టి చాలామంది యూత్ థియేటర్స్ బాట పట్టారు. సినిమాను కల్ట్ బ్లాక్ బస్టర్ చేసారు.

మనం ఒక స్టేజ్ దాటిపోయినా , ఆ స్టేజ్ లో ఇప్పుడు కొంతమంది ఉంటారని గ్రహించి వాళ్ళకి ఈ సినిమా ఎంతలా ఎక్కుందో ముందే గ్రహించాడు సాయి రాజేష్. ఒక వర్గపు ప్రేక్షకుల పల్స్ ను బాగా పట్టుకున్నాడు అనడానికి నిదర్శనమే నేడు బేబీ సినిమాకి వస్తున్న కలక్షన్స్.

ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్న కూడా తను చూసి పదిమందికి సోషల్ మీడియా వేదికగా చెబుతుంటాడు సాయి రాజేష్. మయూరి , మిమి, భూతకాలం, హోమ్, ఇరట్టా, etc ఇలాంటి సినిమాలను పదిమందికి సజెస్ట్ చేసే సాయి రాజేష్ నుంచి అటువంటి కొత్త తరహా సినిమాను కొందరు ఉహించి ఉండొచ్చు, కానీ సాయి రాజేష్ ఒక వర్గపు ప్రేక్షకుల పల్స్ ను గ్రహించాడు అనడానికి నేడు బేబి సినిమాకు వస్తున్న కలక్షన్స్ నిదర్శనం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు