#VarunLav: వరుణ్ తేజ్, లావణ్య ల పెళ్లి ఎప్పుడంటే..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డింపుల్ క్వీన్ లావణ్య లకు జూన్ 9న ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా వీరిద్దరిపై వచ్చిన రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టారు ఎంగేజ్మెంట్ ద్వారా. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.

ఎంగేజ్మెంట్ అయితే, అయ్యింది కానీ, పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది వంటి డీటెయిల్స్ అనౌన్స్ చేయకపోవటంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర దించుతూ ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ముందుగా ప్రచారం జరిగినట్టుగానే ఇటలీలో ఆగస్టు 24న వరుణ లావణ్యల మ్యారేజ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఈ లవ్లీ కపుల్ మధ్య మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ఇటలీలో కాబట్టి మ్యారేజ్ కూడా అక్కడే ప్లాన్ చేశారని అంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి గెస్ట్స్ కూడా లిమిటెడ్ గా ఉండే అవకాశం ఉంది. దీంతో ఎంగేజ్మెంట్ కి, మ్యారేజ్ కి ఫ్యాన్స్ ను ఇన్వైట్ చేయని మెగాఫ్యామిలీ తర్వాత రిసెప్షన్ అయినా హైదరాబాద్ లో ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 28న రిలీజ్ కానున్న ఈ సినిమా వరుణ్ పెళ్లి తర్వాత రిలీజ్ అయ్యే మొదటి సినిమా అవుతుంది. మరి, గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న వరుణ్ కి పెళ్లి తర్వాత రిలీజ్ అయ్యే గాండీవదారి అర్జున సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు