Gunasekhar: హిరణ్య కశ్యప వివాదం ముదురుతుందా?

హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రతి డైరెక్టర్ కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. రిటైర్ అయ్యే లోపు ఆ ప్రాజెక్ట్ ను చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యి ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వచ్చాయి. పొన్నియిన్ సెల్వన్ కూడా అదే కోవకు చెందినదే. అయితే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ల ప్రస్తావన ఇప్పుడెందుకంటే?, ప్రస్తుతం గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ హిరణ్యకశ్యప విషయంలో రచ్చ గురించి చెప్పాలి కాబట్టి. చాలా కాలంగా గుణశేఖర్ బ్రెయిన్ లో ఉన్న ఈ హిరణ్యకశ్యప కథను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని రుద్రమదేవి సినిమా టైమ్ లో డిసైడ్ అయ్యాడు. రానా హీరోగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అప్పట్లో అనౌన్స్ చేశారు. గుణశేఖర్ తో కలిసి 80కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు ఒక నిర్మాత ముందుకొచ్చాడు. ఆ తర్వాత బడా ప్రొడ్యూసర్ సీన్లోకి ఎంటరవ్వటంతో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసాడు గుణశేఖర్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు కంప్లీట్ అయ్యిందని కూడా అంటున్నారు.

అయితే, మొదట్లో సినిమా చాలా ఎక్సైటింగ్ గా ఉన్న సురేష్ బాబు కొంత కాలం తర్వాత సినిమాను పట్టించుకోవటం మానేశాడు. దీంతో గుణశేఖర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కనపెట్టి శాకుంతలం సినిమాను లైన్లో పెట్టాడు. ఇప్పుడు కామికాన్ వేదికగా హీరో రానా హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయటంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గురూజీ త్రివిక్రమ్ అందించే స్క్రిప్ట్ తో వేరే డైరెక్టర్ తో హిరణ్యకశ్యప సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేయటంతో గుణశేఖర్ మండిపడుతున్నాడు. తను ఎప్పటి నుండో ఆశలు పెట్టుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ను తన ప్రమేయం లేకుండా తనను కాకుండా వేరే డైరెక్టర్ తో అనౌన్స్ చేయటం ఏంటని ఫైర్ అవుతున్నాడు వర్సటైల్ డైరెక్టర్.

హాలీవుడ్ సూపర్ హీరో థార్ తరహాలో మన పురాణాల్లో కూడా హిరణ్యకశ్యప లాంటి సూపర్ హీరోలు చాలా మంది ఉన్నారని, అలాంటి కథలతో హాలీవుడ్ ని బీట్ చేసేలాగా సినిమాలు తీయచ్చన్నది గుణశేఖర్ ప్లాన్. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకున్న టైమ్ లో సాయిమాధవ్ బుర్ర ని డైలాగ్ రైటర్ గా అనుకున్నారు. తర్వాత ఈ సినిమా మీద ఇంట్రస్ట్ తో డైలాగ్స్ అందిస్తానంటూ సీన్లోకి ఎంటరైన గురూజీ ఏ మంత్రం వేశాడో కానీ, గుణశేఖర్ ని పిక్చర్ నుండి పూర్తిగా తప్పించాడు సురేష్ బాబు. తన అనుమతి లేకుండా తన కథతో సినిమాను అనౌన్స్ చేయటం అన్యాయం అని, న్యాయం జరిగే వరకు లీగల్ గా ప్రొసీడ్ అవ్వటానికి కూడా సిద్దమే అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నాడు గుణశేఖర్. మరి, ఈ క్రేజీ ప్రాజెక్ట్ చుట్టూ అల్లుకున్న వివాదం ఎంతవరకు వెళుతుందో, అసలు హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు