ProjectK Glimpse: అన్నింటికీ సమాధానం చెప్పేశారు… కానీ?

ProjectK Glimpse

ఒక ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ అభిమానులు అందరూ వెయిట్ చేసిన ProjectK Glimpse రానే వచ్చింది. దీనికి ముందు మూవీ యూనిట్ “వాట్ ఈజ్ ప్రాజక్ట్ కె” అంటూ క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. దాదాపు వారం రోజుల నుంచి సినీ అభిమానులను ప్రాజెక్ట్ కె అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా ? అంటూ ఊరించింది. ఇటు ప్రాజెక్ట్ కె అంటో ఏమిటో తెలుసుకోవాలని ఉందా అంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూనే మరో పక్క దీపికా పదుకొనె, ప్రభాస్ లుక్స్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

దీపికా లుక్ రిలీజ్ చేసే టైమ్‌లో కొంత ఆలస్యమైంది. దీంతో ఆడియన్స్ ఆగ్రహానికి మూవీ యూనిట్ బలైపోయింది. లుక్ రిలీజ్ అయిన తర్వాత ఆలస్యమైనా, దీపికా పదుకునె లుక్ ను మరింత బాగా డిజైన్ చేసి ఉండాల్సింది అంటూ ట్రోల్స్ చేశారు. ఈ లుక్ కోసం ఇంత టైమ్ తీసుకున్నారా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ? అంటూ విమర్శలు వచ్చాయి.

అయితే దీపికా లుక్ రిలీజ్ సమయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవాల్సింది పోయి, అదే తీరుగా ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్ లుక్ రిలీజ్ టైంలో కూడా అదే ఆలస్యం.. అవే విమర్శలు… సేమ్ ట్రోల్స్ వచ్చాయి. ఐరెన్ మ్యాన్ ఫోటోకి ప్రభాస్ తలను అతికించారు. అమీర్ పేట్ ఎడిటింగ్. నాగ్ అశ్విన్ మార్క్ ఏది? ఇన్ని రోజులు చేసింది దీని కోసమేనా ? అంటూ విపరీతంగా విమర్శలు వచ్చాయి.

- Advertisement -

వీటన్నింటికీ సమాధానం చెప్పారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకలో ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ ను విడుదల చేశారు. హాలీవుడ్ స్టాండర్డ్ విజువల్స్, బీభత్సమైన యాక్షన్స్ సీన్స్ తో ఉన్న ఈ గ్లింప్స్ ఇప్పటి వరకు వచ్చిన ట్రోల్స్, మీమ్స్ కి సమాధానం చెప్పేసింది. నాగ్ అశ్విన్ మార్క్ ఏంటో చూపించింది. 1:12 మినిట్స్ ఉన్న ఈ గ్లింప్స్ లో “వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె” అనే ఒకే ఒక్క డైలాగ్ ఉన్నా.. దాని వెనకాలో ఏదో పెద్ద స్టోరీ ఉందని గ్లింప్స్‌తో తెలుస్తోంది.

అలాగే మూవీకి kalki 2898 AD అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ప్రాజెక్ట్ కె లో కె అంటే కల్కి అని చాలా రోజుల నుంచి గాసిప్స్ వచ్చాయి. ఫైనల్ గా అదే నిజమైంది. కాగా, ఈ గ్లింప్స్‌, టైటిల్‌తో సినిమాపై ఎంత హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక తెలుగులోనే కాదు.. సినిమా ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రాజెక్ట్ కె (kalki 2898 AD) కోసం ఎదురుచూస్తుంది.

ఇక్కడి వరకు బాగానే ఉంది. అన్నింటికీ సమాధానం ఇచ్చేశారు. కానీ, రిలీజ్ డేట్ విషయానికి వచ్చే సరికి సస్పెన్స్ పెట్టేశారు. ప్రాజెక్ట్ కె kalki 2898 AD ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేస్తామని ఎప్పడెప్పుడో ప్రకటించారు. గ్లింప్స్ లో మాత్రం ఎక్కడ కూడా రిలీజ్ డేట్ ను మెన్షన్ చేయలేదు. దీంతో మూవీ వాయిదా పడుతుందా అనే అనుమానాలు అభిమానుల్లో పెరుగుతున్నాయి. ఈ ఒక్క దానిపై ప్రాజెక్ట్ కె kalki 2898 AD టీం క్లారిటీ ఇస్తే అన్ని సెట్ అయినట్టే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు