Kalki 2898 AD: రాజమౌళి కాదు… ఇప్పుడు అంతా నాగ్ అశ్వినే

తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఆడాలి. టాలీవుడ్ హీరోలకు ఫ్యాన్స్ కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే. బయట సినీ ప్రపంచంతో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధం లేదు. ఒక వేళ బయట సినీ ప్రపంచంలోకి వెళ్లినా తెలుగు స్టార్స్ కు, ఇక్కడి సినిమాలకు గుర్తింపు ఉండదు. కనీసం గౌరవం దక్కదు. ఇలాంటి వాటిని కూకటివేళ్ళతో సహా పెకిలించి పడేశాడు జక్కన్న.

మొన్న వచ్చిన బాహుబలి… నిన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలతో యావత్ సినీ ప్రపంచం తెలుగు ఇండస్ట్రీవైపు చూసింది. ఇక్కడ కూడా మంచి సినిమాలు వస్తున్నాయని ఇవి నిరూపించాయి. దీన్ని చూసే ఇప్పుడు పాన్ ఇండియా ప్రయోగాలు చేస్తున్నారు తెలుగు దర్శకులు.

అయితే ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ ప్రయోగం చేస్తున్నాడు ఓ డైరెక్టర్. ఆయన ఎవరో కాదు… పట్టుమని రెండు అంటే రెండే సినిమాలు చేసిన కుర్ర డైరెక్టర్ నాగ్ అశ్విన్.

- Advertisement -

నాగ్ అశ్విన్.. మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యం. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎవరీ డైరెక్టర్ అంటూ చర్చ మొదలైంది. ఒక సినిమాను సినిమాలా కాకుండా, ఇలా కూడా తీయ్యచ్చు అని నాగ్ అశ్విన్ నిరూపించాడు. దీని తర్వాత ఇదే తరహాలో చాలా సినిమాలు వచ్చాయి. సక్సస్ అయ్యాయి. ఎవడే సుబ్రమణ్యం తర్వాత నాగ్ అశ్విన్ ఎప్పటికైనా తెలుగు ఇండస్ట్రీని తల ఎత్తుకునేలా చేస్తాడని అప్పుడే క్రిటిక్స్ అంచనా వేశారు.

ఆ టాక్ వచ్చిన తర్వాత నాగి నుంచి వచ్చిన రెండో సినిమా మహానటి. ఒక నటి బయోపిక్ అంటే ఎలా ఉంటుంది. అసలు చూస్తరా ? అనే అనుమానాలు ఉన్న సమయంలో… బయోపిక్ అంటే ఇలాగే తీయాలి అంటూ ఓ ట్రెండ్ సెట్ చేశాడు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ అల్లా టప్ప సినిమాలు చేయడని, తీస్తే కుంభస్థలం కొట్టేలా ఉంటుందని మహానటితో తెలిసిపోయింది.

ఇప్పుడు కుంభస్థలం కొట్టే సమయం రానే వచ్చింది. అదే ప్రాజెక్ట్ కె. దీనికి నిన్నే Kalki 2898 AD టైటిల్ అని అనౌన్స్ చేసి, ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. గ్లింప్స్ రిలీజై గంటలు గడుస్తున్నా… ఎక్కడ చూసిన దీని గురించే టాపిక్ . ఏ సోషల్ మీడియాలో చూసినా ప్రాజెక్ట్ కె గురించే చర్చ. గ్లింప్స్ కే ఇలా ఉంటే, ట్రైలర్ వస్తే… అదే మూవీ వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచనలకే అందడం లేదు.

హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఉన్న ఈ మూవీ ఒక్క మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో సంచలనం సృష్టించేలా ఉందని అంచనా వేయొచ్చు. Kalki 2898 AD రిలీజ్ తర్వాత డైరెక్టర్లకు ఒక ఐకాన్ గా నాగ్ అశ్విన్ ఉంటాడు అని కూడా చెప్పొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు