Kalki: బాక్సాఫీస్ బద్దలయ్యే కాంబినేషన్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కల్కి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సినిమా యూనిట్ తాజాగా రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ ద్వారా ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇచ్చింది. టైటిల్ తో పాటు 2898 A.D అంటూ ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ సినిమాపై ఆసక్తి పెంచటమే కాకుండా అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ ముఖ్య పాత్రలో నటించగా కమల్ హాసన్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. 2024 జనవరి 12న రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ కానుంది. 500కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ హై రేంజ్ లో ప్లాన్ చేసింది సినిమా యూనిట్.

ప్రెస్టీజియస్ ఈవెంట్ అయిన కామిక్ కాన్ వేదిక మీద ఈ సినిమా గ్లిమ్ప్స్ రిలీజ్ చేసిన సందర్బంగా మీడియాతో మాట్లాడిన ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఒక మల్టీ స్టారర్ లో నటించనున్నట్లు వెల్లడించాడు. తారక్, చరణ్ లు తనకు మంచి స్నేహితులని, తప్పకుండ వారితో కలిసి సినిమా చేస్తానని కన్ఫార్మ్ చేసాడు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తే భారీ వసూళ్లతో రికార్డుల మోత మోగటమే కాకుండా ఆస్కార్ వరకు తెలుగు సినిమా ఖ్యాతిని వ్యాపింప చేసింది.

ప్రభాస్ చెప్పినట్టు ఈ కాంబినేషన్ గనక కార్యరూపం దాల్చితే బాక్సాఫీస్ బద్దలవ్వటం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. అసలే ప్రాజెక్ట్ కె గ్లిమ్ప్స్ ఇచ్చిన హైప్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ మరింత కిక్ ఇచ్చింది. పక్కాగా తమ కాంబినేషన్లో సినిమా ఉంటుందని ప్రభాస్ హామీ ఇచ్చిన ఈ క్రేజీయెస్ట్ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు