Janhvi Kapoor: తెలుగు హీరోతో జాన్వీ పెళ్లి..చాలా మోజు పడిందిగా !

బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్… గురించి తెలియని వారు ఉండరు. జాన్వీ కపూర్… శ్రీదేవి, బోనికపూర్ కుమార్తెగా బాలీవుడ్ లో అడుగు పెట్టింది. మొదటి సినిమా ధడక్ తోనే అందరి మనసును దోచేసిన ఈ భామ… ఆ తర్వాత సినిమాలు అంతగా ఫెం రాబట్టలేకపోయాయి. చేసిన అన్ని సినిమాలు…. ప్రయోగాత్మక సినిమాలే. త్వరలోనే వరుణ్ దావన్ తో కలిసి మొదటిసారిగా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా జాన్వికపూర్ గురించి టాలీవుడ్ లో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే జాన్వి కపూర్ మరికొన్ని రోజుల్లో తెలుగింటికి కోడలుగా వెళ్లబోతుందట. ఇప్పుడు అదే విషయం వైరల్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం జాన్వికపూర్ టాలీవుడ్ స్టార్ హీరోని ప్రేమిస్తుందట. అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట.

అయితే…. ఆ స్టార్ హీరోకి తెలుసో లేదో కానీ చాలామంది దర్శక నిర్మాతలు ఆమె దగ్గరికి వస్తే ఆ స్టార్ హీరో సినిమాలో నేను చేస్తాను అంటూ ఓపెన్ గానే చెప్పేస్తుందట. దీంతో జాన్వీకపూర్ పెళ్లి విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కాగా, జాన్వి కపూర్ ఇప్పటివరకు కమర్షియల్ గా ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఈ సినిమాతోనైనా కమర్షియల్ హిట్ కొడుతుందని అంత అంటున్నారు. ఇక జాన్వి ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన “దేవర” సినిమా చేస్తుంది. ఇది వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు