Sagar K Chandra: పద్మభూషణ్ అవార్డు పై భీమ్లా దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

సాగర్ కె చంద్ర ఇది ఒకప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన పేరు. కానీ ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ వంటి సక్సెస్ ని కొట్టాడు కాబట్టి. అయ్యారే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సాగర్ కె చంద్ర. ఆ సినిమా అనుకున్న స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కూడా మంచి ప్రశంసలను తీసుకొచ్చి పెట్టింది.

ఆ తరువాత శ్రీ విష్ణు నారా రోహిత్ హీరోగా నటించిన అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా కమర్షియల్ హిట్ తో పాటు సాగర కే చంద్ర కి కూడా మంచి పేరును తీసుకొచ్చింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ తో పనిచేసే అవకాశాన్ని కూడా తీసుకొచ్చి పెట్టింది. కానీ పవన్ కళ్యాణ్ తో రీమేక్ కంటే కూడా డైరెక్ట్ ఫిలిం చేసే సత్తా కూడా ఉన్న దర్శకుడు సాగర్.

మలయాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా థియేటర్ వద్ద కమర్షియల్ గా బానే స్కోర్ చేసింది. కానీ టికెట్ రేట్లు తగ్గి ఉండటం వలన అప్పట్లో కొంచెం మేరకు నష్టాలను ఎదుర్కొన్నారు ప్రొడ్యూసర్స్. ఈ సినిమాకి సాగర్ చంద్ర కంటే కూడా ఎక్కువ పేరు త్రివిక్రమ్ కి వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా డైలాగ్స్ అంత బాగా ఫేమస్ అయ్యాయి. ఈ సినిమా కూడా దగ్గరుండి త్రివిక్రమ్ నడిపించాడనే వార్తలు కూడా వినిపించాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తో ఒక హిట్టు కొట్టే దర్శకుడుగా మాత్రం సాగర కే చంద్రకి మంచి తృప్తిందని తన మాటల్లోనే అన్నాడు.

- Advertisement -

ప్రస్తుతం సాగర్ కె చంద్ర బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమాను చేస్తున్నాడు. రీసెంట్ గా వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకి గెస్ట్ గా హాజరైన సాగర్ చంద్ర చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు లభించిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీకు పద్మభూషణ్ లభించడం వలన మీకు ఏమొచ్చిందో తెలియదు. కానీ ఆ అవార్డ్స్ కు మాత్రం రెస్పెక్ట్ అండ్ కల్ట్ వచ్చింది సార్ అంటూ చెప్పుకొచ్చాడు. సాగర్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు