Operation Valentine: పవన్ కళ్యాణ్ పై నాగబాబు ప్రశంసలు

ముకుంద సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నాడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక చాలామంది హీరోల్లా కాకుండా తన కెరీర్ లో విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాడు వరుణ్ తేజ్.

వరుణ్ తేజ్ కెరియర్ లో మంచి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వరుణ్ కెరియర్ లో ముకుంద, కంచె, ఫిదా,తొలిప్రేమ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. వరుణ్ణి మంచి హీరోగా ఆయా సినిమాలు నిలబెట్టాయి. అయితే రీసెంట్ టైమ్స్ లో వరుణ్ తేజ్ హిట్ చూసి చాలా కాలం అయిందని చెప్పొచ్చు. ఎంతో నమ్మి చేసినా గని గాండీవదారి అర్జున సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి.

రీసెంట్ గా లావణ్య త్రిపాటిని పెళ్లి చేసుకొని వరుణ్ ఒక ఇంటివాడు అయిన విషయం తెలిసిందే. ఇకపోతే వరుణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన తన తండ్రి నాగబాబు ప్రధానమంత్రి మోడీ గురించి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని మంచి మాటలు చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఎవరైతే ప్రయత్నం చేస్తూ చేస్తూ… ముందుకి వెళ్తారో…. వాళ్ళు ఎప్పటికైనా Success అవుతారు. ఆ మాటలకు ఉదాహరణగా ప్రధానమంత్రి మోదిని పరిగణించారు ఆ తర్వాత త్వరలో ప్రూవ్ చేసుకోబోతున్న పవన్ కళ్యాణ్ ఒకరు అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.

నాగబాబు ప్రయత్నం గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ వరుణ్ తేజ్ ఎంచుకునే సినిమాలు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వరుణ్ తేజ్ సినిమాలు ఫెయిల్ అయిన కూడా వరుణ్ తేజ్ యాక్టర్ గా ఎక్కడ ఫెయిల్ కాలేదు. కొత్త ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. అందుకని ప్రయత్నం చేస్తూ చేస్తూ ముందుకెళ్ళినవాడు ఎప్పటికైనా సక్సెస్ అవుతారంటూ నాగబాబు చెప్పి ఉండొచ్చు అన్నది చాలామంది అభిప్రాయం కూడాను.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు