Sundeep Kishan: డిజాస్టర్ సినిమాపై తగ్గని ప్రేమ

ప్రస్థానం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ కిషన్. ఆ సినిమాలో అగ్రిసివ్ బ్రదర్ గా కనిపించి చాలామందికి ఫేవరెట్ యాక్టర్ అనిపించుకున్నాడు. ఆ సినిమా తర్వాత హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. సందీప్ కిషన్ కెరియర్ లో మంచి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. రొటీన్ లవ్ స్టోరీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వంటి సినిమాలు సందీప్ కిషన్ కి మంచి పేరును తీసుకొచ్చాయి.

సందీప్ కిషన్ లోని యాక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది కొత్త దర్శకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు సందీప్. ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న లోకేష్ కనకరాజ్ గురించి అందరికంటే ముందే సందీప్ తెలుసుకున్నాడు. సందీప్ నటించిన మా నగరం సినిమాతో లోకేష్ కనగరాజ్ దర్శకుడుగా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయి టెక్నికల్ గా కూడా చాలామందిని ఆశ్చర్యపరిచింది.

తర్వాత లోకేష్ కనకరాజ్ తీసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను రాబట్టాయి. లోకేష్ కనకరాజ్ అంటే ఏంటి అనేది ప్రపంచం మొత్తం తెలిసేలా ఆ సినిమాలు చేశాయి. కొన్ని సినిమాలు చాలా నమ్మకం పెట్టి తీస్తాము. కానీ థియేటర్ వద్ద ఆ సినిమాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేవు.

- Advertisement -

హీరోలు ఎంతో నమ్మకం పెట్టి పని చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. అలా సందీప్ కిషన్ కెరియర్ లో తీసుకుంటే సందీప్ నటించిన మైఖేల్ సినిమా అని చెప్పొచ్చు. మైఖేల్ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుందని అంటూ చాలా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చి టీజర్ ను కూడా అద్భుతంగా కట్ చేసి సినిమాపై అంచనాలను పెంచారు. కేవలం టెక్నికల్ గా కాకుండానే చాలామంది పెద్ద స్టార్ కాస్ట్ తో ఆ సినిమాను నిర్మించారు.

సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా కోసం సందీప్ కిషన్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆ సినిమా కోసం బాడీ ఫిట్నెస్ తో పాటు చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఇక రీసెంట్ గా ట్విట్టర్ వేదికగా సందీప్ కిషన్ ఈ విషయంపై స్పందించాడు. సినిమాను రీ ఎడిట్ చేసి మళ్లీ రిలీజ్ చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. డిజాస్టర్ గా మిగిలిన ఈ సినిమా సందీప్ కిషన్ ను ఎంతగా నిరాశపరిచిందో ఈ విషయంతో మనం గమనించవచ్చు. అలానే ఈ సినిమా అంటే సందీప్ కిషన్ కి ఎంత ఇష్టమో అనే విషయాన్ని కూడా గమనించొచ్చు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు