Health : లిప్ కలర్ ను బట్టి ఆరోగ్య సమస్యను కనిపెట్టెయ్యండిలా

అందరూ ఇష్టపడే లేత గులాబీల్లాంటి పెదాలు చూడగానే ముద్దొచ్చేస్తాయి. ముఖ్యంగా రొమాన్స్ గుర్తొస్తుంది చాలామందికి. కానీ లిప్ కలర్ ను బట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చన్న విషయం తెలుసా మీకు? సాధారణంగానే మనిషికి ఏదైనా అనారోగ్యం ఉంటే అవి వెంటనే శరీరం భాగాల ద్వారా ఏదో ఒక రూపంలో మనకు తెలియజేస్తాయి. జాగ్రత్తగా ఆ తేడాలను గమనిస్తే సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే సరైన చికిత్స తీసుకొని ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతాం. లేదంటే ఆ నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీసే ఛాన్స్ ఉంటుంది. ఇక మీ ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాన్ని తెలియజేసే శరీర భాగాలలో పెదాలు కూడా ఉంటాయి. నిజానికి పెదాల రంగును పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ రంగును బట్టి మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ ను పెదాలు చెప్తాయి. ఇంతకీ పెదాలు ఏ రంగులో ఉంటే ఏ ఆరోగ్య సమస్య ఉన్నట్టు? అనే వివరాల్లోకి వెళ్తే…

  1. ఎర్రని పెదాలు
    పెదవులు ఎర్రగా ఉంటే చూడడానికి అట్రాక్టివ్ గా కనిపిస్తారు. అందంగా కనిపించాలనే తపనతో చాలామంది తమ పెదవులు ఎర్రగా ఉండాలని కోరుకుంటారు. కానీ అతి కొద్ది మందికి మాత్రమే పెదవులు ఎర్రగా ఉంటాయి. అయితే పెదవులు ఈ రంగులో ఉండడం వల్ల అందంగా కనిస్తారు అన్న విషయాన్ని పక్కన పెడితే, వాళ్లు లివర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు అర్థం.
  2. నల్లని పెదాలు
    చాలామందికి పెదవులు నల్లగా ఉంటాయి. అయితే సిగరెట్ తాగడం వల్ల ఇలా అవుతాయి అని అంటూ ఉంటారు. మరికొంతమంది బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పెదాలు నల్లగా మారుతాయి అని అనుకుంటారు. కానీ నిజానికి జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే పెదవులు నల్లగా కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
  3. నీలిరంగు పెదవులు
    అతి కొద్ది మందికి పెదవులు నీలిరంగులో ఉంటాయి. అయితే పెదవులు అలాంటి రంగులోకి మారడానికి కారణం శరీరంలో సరైన విధంగా ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవడమే. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక్కోసారి ఇదే అత్యవసర పరిస్థితికి దారి తీసే సంకేతం అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైనా నీలిరంగులో కనిపిస్తే వారి ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయట్లేవని అర్థమట.
  4. తెల్లని పెదాలు
    చాలా తక్కువ మందికి మాత్రమే పెదవులు తెల్లగా ఉంటాయి. అలాంటి రంగులో పెదవులు ఉన్నాయి అంటే శరీరంలో రక్తం తగ్గిందని అర్థం. అది రక్తహీనత సమస్యకు సంకేతం. అలాగే రక్తంలో బిలుర్బిన్ పరిమాణం తగ్గడం కూడా ఒక కారణం అవుతుంది. కొన్నిసార్లు మాత్రం వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా పెదాలు తెల్లగా కనిపిస్తాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు