Lifestyle : మందుతో పాటు ఇవి తింటే మీ హెల్త్ మటాష్… జాగ్రత్త

ప్రజల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది ఇప్పుడు. వారానికి ఒక్కసారి తాగేవారు కొందరైతే, రోజూ తాగేసి కష్టాలు మరిచిపోయే వారు మరికొందరు. ఇక సమయం, సందర్భం లేని పార్టీలు, సండేల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాగినప్పుడు మందులోకి మంచింగ్ కంపల్సరీ. చాలామంది ఆవకాయ, స్నాక్స్ వంటి వాటిని ఆల్కహాల్ లోకి స్టఫ్ గా తింటూ ఉంటారు. కానీ మందుతో పాటు స్టఫ్ గా తీసుకునే ఫుడ్ మనకు తెలీకుండానే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ముఖ్యంగా గ్యాస్, జీర్ణ వ్యవస్థలో సమస్యలు, గుండెలో మంట వంటి సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఇలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మందుతో పాటు తినకుండా ఉండాల్సిన ఆ స్టఫ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. పిజ్జా
    మందు తాగేటప్పుడు కొంతమంది స్టఫ్ గా పిజ్జాను తింటూ ఉంటారు. కానీ ఇలా మందు, పిజ్జా కలిపి తీసుకోవడం వల్ల పిజ్జాలో ఉండే కొవ్వు పదార్థాలు ఆల్కహాల్ లో కలిసి తీవ్ర జీర్ణ సమస్యలకు దారి తీస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
  2. కెఫిన్
    మద్యంలోకి స్టఫ్ గా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాల్లో కెఫిన్ కూడా ఉంటుంది. కెఫిన్ కలిగి ఉన్న ఆహార పదార్థాలను, పానీయాలను ఆల్కహాల్ తో కలిపి తీసుకుంటే అది నేరుగా గుండె మీద ప్రభావం చూపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు ఒక రకమైన ఆందోళన పెరుగుతుంది.
  3. బీన్స్
    సాధారణంగానే బీన్స్, కాయ దాన్యాలు వంటివి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. మందుబాబులు ఆల్కహాల్ కు స్టఫ్ గా బీన్స్, కాయ దాన్యాలు వంటివి తీసుకుంటే అది జీర్ణ సమస్యలను పెంచుతుంది.
  4. ఫ్రెంచ్ ఫ్రైస్
    మందుబాబులు ఆల్కహాల్ లోకి స్టఫ్ గా నంజుకోవడానికి ఎక్కువగా ఇష్టపడే వాటిల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉంటాయి. కానీ వాటిలో ఎక్కువగా ఉండే ఉప్పు, కొవ్వు వంటివి ఆల్కహాల్ తో కలిస్తే రక్తపోటు ప్రమాదం పెరిగిపోతుంది.
  5. ఊరగాయ
    చాలామంది ఆల్కహాల్ తాగుతున్నప్పుడు స్టఫ్ గా ఇంట్లో ఉండే ఊరగాయను తింటూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. ఊరగాయలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది ఆల్కహాల్ తో కలిపి తీసుకుంటే డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది.
  6. చాక్లెట్
    మందు తాగేటప్పుడు తినకూడని ఆహార పదార్థాలలో చాక్లెట్ ముందు వరుసలో ఉంటుంది. చాక్లెట్ లో ఉండే టైరామైన్ అనే పదార్థం మందుతో కలిస్తే మైగ్రేన్, వికారం, వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది.
  7. పాల పదార్థాలు
    ఆల్కహాల్ తాగుతున్నప్పుడు స్టఫ్ గా పాల ఉత్పత్తులు అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మందులో స్టఫ్ గా ఏవైనా పాల ఉత్పత్తులు తీసుకుంటే కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు